తెరపై…మెరిసిన అక్కాచెల్లెళ్ళు!!!

  • June 13, 2016 / 12:50 PM IST

తెలుగు తెరపై ఎందరో తారామణులు తమ అభినయంతో, అందచందాలతో ఆకట్టుకున్నారు. అయితే టాప్ హీరోయిన్స్ మాత్రమే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ సైతం తమ పరిది మేర వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. అదే క్రమంలో అలా ఇండస్ట్రీలో సెటిల్ అయినవారి ఇమేజ్ ను ఆధారంగా చేసుకుని వారి కుటుంభ సభ్యులుసైతం టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అనులో కొందరు సూపర్ సక్సెస్ కాగా..మరికొందరు పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. మరి అలాంటి తారల్లో ఎందరో అక్కాచెల్లెలు సైతం ఉన్నారు. మరి ఆ అక్కాచెల్లెళ్ళ లెక్కలపై ఒక లుక్ వేద్దాం రండి…

జ్యోతి లక్ష్మి…జయమాలిని80వ దశకంలో అటు తెలుగు..ఇటు తమిళంలో వరుస ఐటమ్ సాంగ్స్ లో, వ్యాంప్ పాత్రల్లో చెలరేగిపోయారు ఈ ఇద్దరు సిస్టర్స్. చాలా సినిమాల్లో కలసి నటించి..నర్తించారు కూడా.

జయసుధ…శుభాషినిసహజనటి జయసుధ సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శుభాషిని తన పరిధిమేర ఆకట్టుకున్నారు.

రాధ…అంబిక90వ దశకంలో చిరుతో చిందులేసిన అందాల తార రాధిక సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంబిక తనదిన శైలిలో నటించి మెప్పించారు.

రాధిక…నిరోషతమిళ సినిమాలతో తన సినిమా కరియర్ ను మొదలుపెట్టిన రాధిక తన సోదరి నిరోషను సైతం తెరపైకి తీసుకొచ్చారు. ఇద్దరు ప్రేక్షకుల మన్నలను పొందారు.

నగ్మ…జ్యోతిక…రోషిణి!!అందాల భామ నగ్మ వరుస సినిమాలతో దూసుకుపోయిన కాలంలో అటు జ్యోతిక, ఇటు రోషిణి ఇద్దరూ తెరపై తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా జ్యోతిక మంచి తారగా గుర్తింపు తెచ్చుకుంది.

షాలిని..షామిలి!!!చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించుకున్న షాలిని తన క్రేజ్ తో తన సోదరి షామిలిని సైతం తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.

కాజల్ అగర్వాల్…నిషా అగర్వాల్!!!అందాల భామ కాజల్ అగర్వాల్ సోదరిగా తెలుగు తెరకు పరిచయం అయిన నిషా అగర్వాల్…పెద్దగా సినిమాల్లో రాణించకపోవడంతో ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని ఇల్లాలిగా మారిపోయింది.

శ్రుతి హసన్…అక్షర హసన!!!కమల్ హసన్…తరువాత ఆయన ఛరిష్మానీ ఇండస్ట్రీలో కొనసాగింపుగా వచ్చిన శ్రుతి హసన్…అదే దారిలో పయనిస్తుంది శ్రుతి సోదరి అక్షర హసన్.

ఆర్తి అగర్వాల్…అదితి అగర్వాల్!!!నువ్వు నాకు నచ్చవ్ చిత్రంతో అందాల భామ ఆర్తి అగర్వాల్…తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అయితే అదే దారిలో ఆమె సోదరి అదితి అగర్వాల్ ను సైతం తెరపైకి తీసుకువచ్చింది.

సంజన…నిక్కి గాల్రాని!!!కన్నడ భామ సంజన తెలుగులో బుజ్జిగాడు సినిమాలో నటించింది. ఇక ఆమె సోదరి నిక్కీ సైతం గత ఏడాది తన కరియర్ ను స్టార్ట్ చేసింది.

కార్తీక….తులసినయిర్ప్రముఖ నాటి రాధ కుమార్తెలు కార్తీక, తులసినయర్ ఇద్దరూ తెలుగు తెరపై అందాల భామల జాబితాలో చేరిపోయారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus