వీరభోగ వసంతరాయులు ట్రైలర్లో మిస్సయిన సుధీర్ బాబు వాయిస్

  • October 16, 2018 / 12:42 PM IST

సుధీర్ బాబు కెరీర్ మొదట్లో చేసిన “ఎస్.ఎం.ఎస్” సినిమాలో మనోడి వాయిస్ కి విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వినిపించిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని సుధీర్ బాబు కూడా సీరియస్ గా తీసుకొని వాయిస్ మాడ్యులేషన్ మార్చుకొన్నాడు. ఇక బాబు ఇప్పుడు “సమ్మోహనం, నన్ను దోచుకుందువటే” చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇదే ఫామ్ లో వస్తున్న “వీరభోగవసంతరాయులు” చిత్రంతోనూ మంచి హిట్ కొట్టి హ్యాట్రిక్ దక్కించుకొంటాడేమో అనుకొన్నారందరు. నిన్న ఈ చిత్రం ట్రైలర్ కూడా విడుదలైంది. అక్టోబర్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం ట్రైలర్ లో కంటెంట్ కంటే ఎక్కువగా ఆడియన్స్ ను ఆకట్టుకొన్న విషయం సుధీర్ బాబు వాయిస్.

మరి మనోడు చెప్పను అన్నాడో లేక ట్రైలర్ డబ్బింగ్ జరిగే టైమ్ కి ఎవైలబుల్ గా లేడో తెలియదు కానీ.. సుధీర్ బాబు క్యారెక్టర్ కి వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు. ఇక్కడ మెలికి ఏమిటంటే.. సుధీర్ బాబుకి ముందు చెప్పిన రోల్ కి వచ్చిన అవుట్ పుట్ కి సంబంధం లేకపోవడంతో కావాలనే డబ్బింగ్ చెప్పలేదని కూడా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. మరి వీటిలో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus