హాట్ యాంకర్ రష్మీ, కమెడియన్ సుధీర్ ప్రేమికులుగా బాగా పాపులర్ అయ్యారు. ఈ రూమర్ వల్లే బుల్లితెరపై వీరు చేసే షోలకు టీఆర్పీ అమాంతం పెరిగిపోతుంటుంది. అయితే ఈ గాసిప్ తన కొంపని ముంచిందని సుధీర్ వాపోతున్నారు. జబర్దస్త్ షోలో రష్మీ యాంకరింగ్ చేస్తుండగా, సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్ గా నవ్విస్తున్నారు. అప్పుడు ఇతర పార్టిసిపెంట్స్ సుధీర్, రష్మీ మధ్య సంబంధం ఉందని కౌంటర్ పేలుస్తుంటారు. తమాషాకి కోసం సృష్టించిన ఈ లింక్ సుధీర్ కి కష్టాలను తెచ్చిపెట్టింది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం పై స్పందించారు.
“నాకు రష్మీకి ఎలాంటి అఫైర్ లేదు. నేను ఆ సంగతిని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవరూ ఒప్పుకోవడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ” ఈ మధ్య నాకు అమ్మాయిల పిచ్చి ఉందన్నట్టు స్కిట్ ల్లో చెబుతున్నారు. దీనివల్ల నా క్యారక్టర్ చెడ్డదని ప్రచారం సాగుతోంది. నేను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని ఎవరూ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు” అంటూ వాపోయారు. కొన్నిసార్లు మనపై మనం సరదాగా వేసుకునే జోకులే చిక్కులు తెస్తాయనటానికి సుధీర్ లైఫ్ ఒక ఉదాహరణ. ఇప్పటికైనా స్కిట్స్ లో తనపై సెటైర్ లను సుధీర్ అడ్డుకుంటారో, లేదో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.