ఆ షోలన్నీ సుధీర్ వల్లే ఆగిపోయాయట..!

  • October 21, 2020 / 07:48 PM IST

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ అయిన సుడిగాలి సుధీర్ కు కరోనా సోకిందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్త నిజామా? కాదా? అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. అయితే ఈ వార్త నిజమే అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చాలా ప్రోగ్రాంలు కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందట.పూర్తి వివరాల్లోకి వెళితే.. సుడిగాలి సుధీర్ కు రెండు రోజుల క్రితం కరోనా సోకినట్టు సమాచారం.దీంతో ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

సుధీర్ తో పాటు అతనితో షూటింగ్లో పాల్గొన్న వారు కూడా టెస్టులు చేయించుకుని.. ఎందుకైనా మంచిదని హోం ఐసొలేషన్ కు వెళ్లిపోయారట.సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తూనే పలు షోలకు కూడా యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాటితో పాటు పండగలకు కూడా సుధీర్ తో పలు షోలు నిర్వహిస్తూ ఉంటారు పలువురు టీవీ ఛానల్స్ వారు. ఈసారి కూడా దసరా మరియు దీపావళికి.. ఈటీవీ మరియు జీ తెలుగు ఛానల్స్ లో సుధీర్ తో పలు షోలు నిర్వహించాలనుకున్నారట.

కానీ ఇప్పుడవి క్యాన్సిల్ అయ్యాయని తెలుస్తుంది. అంతేకాదు మూడు లేదా నాలుగు వారాల పాటు సుధీర్ ఎటువంటి షోలలో పాల్గొనే అవకాశం లేదని సమాచారం.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus