సుకుమార్ నెక్స్ట్ సినిమా కూడా మెగా హీరోతోనే.!

  • March 20, 2018 / 01:00 PM IST

నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో “రంగస్థలం” సినిమాని కంప్లీట్ చేశారు. పాతికేళ్ల క్రితంనాటి కథతో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని ఈనెల 30 న రిలీజ్ కావడానికి ముస్తాబవుతోంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బోయపాటి శ్రీను తో సినిమా చేయనున్నారు. ఇప్పటికీ ప్రారంభమయిన ఈ చిత్ర షూటింగ్ లోకి త్వరలో చరణ్ జాయిన్ కానున్నారు. మరి దీని తర్వాత సుకుమార్ (Sukumar) ఎవరితో సినిమా చేస్తారు?.. అనే ప్రశ్నకు ఫిలిం నగర్లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏమిటంటే.

మెగా హీరోతోనే సుకుమార్ మళ్లీ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఆ హీరోలలో ఇద్దరి పేర్లు వినిపిస్తుండడం విశేషం. మొదటి పేరు అల్లు అర్జున్. బన్నీతో సుకుమార్ ఆర్య, ఆర్య 2 తీశారు. మళ్ళీ ఇద్దరూ కలిసి సినిమా చేయాలంటే కుదరలేదు. రంగస్థలం తర్వాత బన్నీ కోసమే కథ రెడీ చేస్తారని టాక్. మరికొంతమంది చెబుతున్న దాని ప్రకారం.. సుకుమార్ టేకింగ్ నచ్చి చిరు అతని దర్శకత్వంలో నటించడానికి ఆసక్తిగా ఉన్నారంట. మంచి కథ రెడీ చేస్తే. నటిస్తానని మాట కూడా ఇచ్చారంట. సో సుకుమార్ చిరు, లేకుంటే అల్లు అర్జున్ వీరిద్దరిలో ఒకరితో సినిమా చేయడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus