Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

ఈ ఏడాది స్పెషల్‌ డే నాడు ఫుల్‌ మీల్స్‌ ఆరగిద్దామని రెడీ అయిపోయారు రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌. పుట్టిన రోజు కానుకగా ‘పెద్ది’ సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేద్దాం అని ఫిక్స్‌ అయిపోయారు. అనుకున్నట్లుగానే సినిమా ప్రచారం మొదలుపెట్టారు కూడా. అయితే పనులు పూర్తవ్వలేదని సినిమాను వాయిదా వేసేశారు. దీంతో ఆ రోజు మజా ఉండదు అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఆ రోజు డబుల్‌ కుదిరితే ట్రిపుల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి ఆయన సినిమాల నిర్మాతలు రెడీ అవుతున్నారని సమాచారం.

Sukumar

రామ్‌చరణ్‌ పుట్టిన రోజు అయిన మార్చి 27న ‘పెద్ది’ సినిమా టీమ్‌ నుండి స్పెషల్‌ వీడియో కానీ, గ్లింప్స్‌ కానీ రావొచ్చని సమాచారం. దీనికి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారు. ఎడిట్‌ రూమ్‌లో బుచ్చిబాబు సానా ఉన్న ఫొటో ఒకటి షేర్‌ చేస్తూ.. సినిమా టీమ్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల అప్‌డేట్‌ ఇచ్చింది. ఆ విషయం అలా ఉంచితే ఆ తర్వాత బుచ్చిబాబు గురువు సుకుమార్‌తో చరణ్‌ చేయబోయే సినిమా (RC17) కీలక అప్‌డేట్ ఆ రోజే రాబోతోంది అని సమాచారం.

ఈ సినిమాకు సంబంధించి స్పెషల్‌ వీడియోను కానీ, టీజర్‌ పోస్టర్‌ను కానీ చిత్రబృందం రిలీజ్‌ చేస్తుందని సమాచారం. గత కొన్ని నెలలుగా సుకుమార్‌ అండ్‌ కో. ఇదే పని మీద ఉంది. ఓ కథ రెండు వెర్షన్లను సిద్ధం చేసుకొని, ఒకటి ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారట. ఇలా ‘పెద్ది’ క్యారెక్టర్‌ నుండి రామ్‌చరణ్‌ దిగిపోగానే కొత్త క్యారెక్టర్‌లోకి ఎక్కించేయడానికి సుకుమార్‌ రెడీ అవుతున్నారట. అయితే మధ్యలో రెండు, మూడు నెలల గ్యాప్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

‘రంగస్థలం’ సినిమాకు మించిన ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే లీకులు వస్తున్నాయి. ఈ సినిమాలో చరణ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ని ఇప్పటికే షూట్‌ చేసేశారని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. ఇక మూడో సర్‌ప్రైజ్‌ చరణ్‌ 18వ సినిమాను చేయబోయేది ఎవరు అనే అనౌన్స్‌మెంట్ కూడా అదే రోజు ఉండొచ్చు అని టాక్‌.

 వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus