Suma: అమ్మడియమ్మ.. జయమ్మగా సుమ అదరగొట్టారుగా!

  • December 12, 2021 / 05:30 PM IST

బుల్లితెరపై నంబర్ 1 యాంకర్ గా సుమ కనకాలకు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. దాదాపుగా తెలుగులోని అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో సుమ యాంకర్ గా చేస్తున్న కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ఇతర యాంకర్లతో పోలిస్తే సుమ పారితోషికం చాలా ఎక్కువని గతంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగితే ఆ ఈవెంట్లకు కూడా సుమ యాంకర్ గా ఉండాల్సిందే.

సుమ టైటిల్ రోల్ లో నటిస్తున్న జయమ్మ పంచాయితీ టీజర్ తాజాగా విడుదలైంది. కొన్నిరోజుల క్రితం రామ్ చరణ్ ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఈరోజు రానా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. సుమ ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ కుమార్ కలివరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

65 సెకన్ల నిడివి ఉన్న టీజర్ లో సుమ జయమ్మ పాత్రలో అదరగొట్టేశారని చెప్పాలి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గడుసరి మహిళగా సుమ నటిస్తున్నారు. “రెండు రోజుల్లో తేల్చకపోతే మీరు ఉండరు మీ పంచాయితీ ఉండదు చెప్తున్నా”, “ఆ అనుకోవడమే మిగిలింది ఆకులు నాకేటోడు పోయి మూతులు నాకేటోడు వచ్చినట్టుంది”, “సూత్తాను సూత్తాను మీ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు తెలుసునులే మీరు కానివ్వండి” అంటూ టీజర్ లో సుమ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

జయమ్మ పంచాయితీ సినిమాతో సుమ హిట్టు కొట్టేలా ఉన్నారు. సుమ పాత్ర తీరుతెన్నులు ఆకట్టుకునేలా ఉండటంతో పాటు పల్లెటూరి యాసలో సుమ అద్భుతంగా డైలాగ్స్ చెప్పారు. సుమకు ఈ సినిమా తర్వాత సినిమా ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. టీజర్ లాంఛ్ సమయంలో రానా అమ్మడియమ్మ జయమ్మ అంటూ సుమపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి త్వరలో ప్రకటన వెలువడనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus