అప్పట్లో “నాగ్” రహస్యం ఇప్పుడు బయటపడింది!!!

ఎన్టీఆర్, అక్కినేని తరం తరువాత వారి వారసులుగా వారి కుమారులు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు. అయితే ఇప్పుడు ఆ వంసానికి సంభందించి మూడో తరం వారు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. ఇదంతా పక్కన పెడితే…అలనాటి అందాల భామ, సుమలత ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటెర్వ్యులో నాగ్ కు సంభందించి ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది. అదేమిటి అంటే…అప్పట్లో అక్కినేని నాగేశ్వర రావు గారు తన వద్దకు ఒక ప్రపోసల్ లో వచ్చారని…

అయితే ఆ ప్రపోసల్ ఏంటి అంటే…తాను అక్కినేని నాగేశ్వరరావుతో ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు, తన నటనను అదేవిధంగా తన అందాన్ని చూసి ముచ్చట పడ్డ అక్కినేని ఆమెతో మాట్లాడుతూ…తనకు బాగా తెలిసిన అందమైన ఆరు అడుగుల పొడుగు ఉండే అబ్బాయి ఉన్నాడని ఆ అబ్బాయి విదేశాలలో చదువుకున్నాడు అని చెపుతూ ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటావా ? అంటూ సుమలతను అడిగారట మన అక్కినేని. అంతేకాకుండా ఈ విషయాన్ని తన తల్లికి సైతం తెలియయజేయమని తెలిపారట మన అక్కినేని గారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న సుమలత తల్లి అప్పట్లో ఈ విషయమై అక్కినేనిని అడిగితే ఆ అబ్బాయి తన కొడుకు నాగార్జున అని  చెపుతూ  సుమలత తల్లికి అక్కినేని షాక్ ఇచ్చాడట. అయితే ఇంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు ట్విష్ట్ ఇదే, ఆ తరువాత ఈ పెళ్లి ఎందుకు ముందుకు సాగలేదు, సుమలత, నాగ్ ఇద్దరు వేరే పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారు అన్న విషయం మాత్రం అలనాటి తార వివరించలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus