మళ్లీ పెళ్లిపై స్పందించిన ఆ హీరో!!!

  • November 3, 2016 / 06:46 AM IST

టాలీవుడ్ ఫ్యామిలీస్ లో అక్కినేని ఫ్యామిలీకి మంచి గౌరవం ఉంది. అయితే అదే క్రమంలో ఆ ఫ్యామిలీని రెండో పెళ్లి మ్యాటర్ వెంటాడుతూనే ఉంది. గతంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి వారసుడు అక్కినేని నాగార్జున తొలి పెళ్లి ఇబ్బందుల్లో పడటంతో, రెండో వివాహంగా అమలని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ గతాన్ని అక్కినేని అభిమానులు మారచిపోయే లోపే…అక్కినేని కుటుంభం నుంచి వచ్చిన మరో యువ హీరో సుమంత్ తొలి ప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి…అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు…అయితే ఏమయిందో ఏమో తెలీదు కానీ…వాళ్ళు పెళ్లి అయిన రెండు ఏళ్ళకే విడిపోయి….విడివిడిగా బ్రతుకుతున్నారు.

ఇక సినిమాల పరంగానూ పెద్దగా సక్సెస్ అందుకొని సుమంత్ కొత్త కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు…ఇక అదే క్రమంలో తాజాగా…’నరుడా డోనరుడా’ అన్న సినిమాను స్వయంగా నిర్మించి రిలీజ్ చేయడానికి సిద్దం అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా మిత్రులు పెళ్లి విషయంపై అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ…‘‘అఖిల్ – చైతన్యల పెళ్లిళ్లకు వెళ్లడమే కానీ నేనైతే మళ్లీ పెళ్లి చేసుకోదల్చుకోలేదు. ఇప్పుడంతా బాగానే ఉంది కదా. ఇలా సినిమాలు చేసుకుంటూ బాగానే ఉన్నా. అసలు ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోనే ఉండాలని ఏమీ లేదు’’ అంటూ అంటూ సింపుల్ గా ఇక తాను పెళ్లి చేసుకొను అని తేల్చి చెప్పేసాడు. మరి ఇప్పటికీ ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అనుకోలేను ఈ అక్కినేని వారసుడు…ఈ సినిమాతో అయిన మంచి హిట్ కొట్టాలీ అని ఆశిద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus