లేడీస్ టైలర్ కొడుకు ఇన్నాళ్లకు చిక్కాడు..

Advertisement

దర్శకుడు వంశీ సినిమాలన్నింటిలోకి ‘లేడీస్ టైలర్’ది ప్రత్యేక స్థానం. ప్రేక్షకులతో పాటు వంశీకి ఈ సినిమా అంటే మక్కువ ఎక్కువే. ఆ ఇష్టంతోనే ఈ సినిమాకి సీక్వెల్ చేసి తీరాలని ఏనాడో నిర్ణయించుకున్నారాయన. ‘ఫాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా పలుమార్లు పట్టాలెక్కినట్టే ఎక్కి ఎక్కడో మొరాయించింది. రవితేజ, రాజ్ తరుణ్ ఈ సినిమాలో నటిస్తారని ప్రచారం జరిగిన కార్యరూపం దాల్చలేదు. మొన్నటికి మొన్న దగ్గుబాటి సురేష్ రెండో కుమారుడు అభిరామ్ ఈ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇస్తాడనుకున్నా అదీ జరుగలేదు.

చివరికి సుమంత్ అశ్విన్ రూపంలో ‘లేడీస్ టైలర్’ కొడుకు వంశీ చేతికి చిక్కాడు. దర్శకుడిగా పలు సినిమాలు చేసి నిర్మాతగాను వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. స్వతహాగా వంశీకి అభిమాని అయిన శ్రీధర్ ఈ సినిమాని నిర్మించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా -వంశీలది హార్మోనియం కీప్యాడ్-చేతివేళ్ల సంబంధం లాంటిది. పలు సినిమాలకు చక్రితో స్వరాలు సమకూర్చుకున్న ఒకటి రెండు సినిమాలకు సొంతవైద్యం అన్న చందాన తానే సంగతమందించారు. అయితే ఈ సినిమాకి మణిశర్మని ఎంపిక చేయడం విశేషం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందట. ముగ్గురూ తెలుగమ్మాయిలే నటించనుండటం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus