మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సుమంత్

  • July 19, 2017 / 08:49 AM IST

టాలీవుడ్ లో కొన్ని ఫ్యామిలీస్ ఎప్పటినుంచో తమ హవా కొనసాగిస్తూ తమ వారసులని ఇండస్ట్రీలో చాలామణీ అయ్యేలా చూస్తూ వస్తున్నారు…ఇక అలాంటి ఫ్యామిలీస్ లో అక్కినేని ఫ్యామిలీ ఒకటి అప్పటి నాగేశ్వర రావు నుంచి ఇప్పటి అఖిల్ వరకూ అక్కినేని బ్రాండ్ ను మునుముందుకు తీసుకు వెళ్తూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు…అయితే వారిలో వారి వంశం నుంచి వచ్చిన హీరో సుమంత్. అక్కినేని బ్రాండ్ తో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సుమంత్ కొద్ది కాలంలోనే మంచి హిట్స్ అందుకుని నటన పరంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే బాద్ లక్ వెంటే ఉండడంతో హీరోగా ఎన్ని ప్రయత్నాలు  చేసినా సరే లాభం లేకుండా పోయింది. కెరియర్ లో సత్యం, గోదావరి అనే రెండు సినిమాలు తప్ప ఏది అతనికి క్రేజ్ తీసుకురాలేదు. అయితే గత ఏడాది సుమంత్ విక్కి డోనార్ సినిమా రీమేక్ చేసి నరుడా డోనరుడా అంటూ ప్రేక్షకులను పలకరించాడు…కానీ ప్రేక్షకులు మాత్రం మెచ్చుకొలేదు.

అయితే కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అన్న ఆలోచనతో…మరోసారి మరో ప్రయత్నం చేస్తున్నాడు…గౌతం డైరెక్షన్ లో మళ్లీ రావ అనే సినిమా చేస్తున్నాడు సుమంత్…ఇక ఈ సినిమా విషయానికి వస్తే…మూడు జెనరేషన్స్ కు చెందిన కథగా ఈ సినిమా ఉండబోతుందట. సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయని అంటున్నాడు సుమంత్, అంతేకాకుండా సినిమాతో కచ్చితంగా హిట్ కొడతా అంటున్నాడు సుమంత్. ప్రేక్షకులకు నచ్చే కథతో ఈసారి తన ప్రయత్నం ఉందని అందుకే మళ్లీ రావాపై పూర్తి నమ్మకంతో ఉన్నట్టు చెబుతున్నాడు మరి అంత ఖచ్చితంగా సినిమా హిట్ కొడతాను అంటున్న సుమంత్ అదృష్టం ఎలా ఉండబోతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus