Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Advertisement

గత కొన్నేళ్లలో ఏటా సంక్రాంతి సీజన్‌కి జరిగినట్లే ఈ ఏడాది కూడా జరుగుతుంది అని కొంత మంది టాలీవుడ్‌ జనాలు అందుకున్నారు. ఐదు సినిమాలు విడుదల అవుతున్నాయి.. కచ్చితంగా థియేటర్ల పంచాయితీ వస్తుంది.. ఆ మంటలో చలి కాసుకుందామని ప్లాన్‌ చేశారు. కానీ ప్లానింగ్‌ పక్కాగా ఉండటంతో ఒకట్రెండు చోట్ల తప్ప ఎక్కడా ఇబ్బంది రాలేదు. దీంతో విడుదలైన సినిమాల్లో ఒకటి తప్ప అన్నీ బాగానే ఆడేశాయి. ఇప్పుడు సమ్మర్‌ టైమ్‌ వచ్చేసింది. వేసవిలో ఏయే సినిమాలు రాబోతున్నాయి అనే చర్చ మొదలుపెట్టే సమయం వచ్చేసింది.

Tollywood Summer

2026 సమ్మర్‌ సీజన్‌లో ఫుల్‌ స్టార్స్‌తో నిండిపోనుంది. అయితే అందరూ చెప్పినట్లుగా వస్తేనే. ఎందుకంటే అదిగో ఇదిగో అని చెప్పి అసలు సమయానికి పక్కకు జరగడం మన స్టార్లకు అలవాటే. ఆ విషయం పక్కన పెట్టి సినిమాల సంగతి చూస్తే.. మార్చి ఆఖరి వారం నుండి సినిమాల సందడి ఉండబోతోంది. రామ్‌చరణ్‌ ‘పెద్ది’, నాని ‘ది ప్యారడైజ్‌’, అడివి శేష్‌ ‘డెకాయిట్‌’, నిఖిల్‌ ‘స్వయంభూ’తో సమ్మర్‌ సినిమాలు స్టార్ట్‌ అవ్వాలి. అయితే, ఈ సినిమాల్లో ఏవి వస్తాయి, ఏవి రావు అనే చర్చ తేలడం లేదు.

మార్చి ఆఖరులో రావాల్సిన పై సినిమాలు రాకపోతే పవన్‌ కల్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ వస్తుందని చెప్పారు. కానీ ఈ విషయంలో టీమ్‌ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక ‘విశ్వంభర’ జులైన రెండో వారమని చిరంజీవి ఇటీవల అఫీషియల్‌ లీక్‌ ఇచ్చేశారు. వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ అనుకున్నంత వేగంగా అవ్వడం లేదు. కాబట్టి ఈ సినిమా వానా కాలమే.

ఒకవేళ ‘డెకాయిట్‌’ సినిమా విడుదల ఆలస్యమైతే శేష్‌ తర్వాతి సినిమా ‘జీ 2’ కూడా లేట్‌ అవుతుంది. ఆ లెక్కన గతంలో చెప్పినట్లు మే 1న ఆ సినిమా రాదు. నాగచైతన్య పాన్‌ ఇండియా సినిమా ‘వృషకర్మ’ సాయి తేజ్‌ ‘సంబరాల యేటి గట్టు’ చివరి దశలో ఉన్నాయి. అయితే విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు చాలా రోజులు పడతాయి కాబట్టి ఇప్పట్లో కష్టమే అంటున్నారు.

ఇక వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ సమ్మర్‌లోనే అన్నారు కానీ విడుదల తేదీ వెల్లడించలేదు. అఖిల్‌ ‘లెనిన్‌’ మే 1న అన్నారు కానీ అప్పటికల్లా అవుతుందనే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ లెక్కన సమ్మర్‌ సినిమాల విషయంలో ఏ లెక్కా తేలడం లేదు.

విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus