Sundarakanda Collections: ‘కొత్త లోక’ వల్ల పెద్ద దెబ్బ పడింది

నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సుందరకాండ’. ఆగస్టు 27న వినాయక చవితి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాకి మొదటి రోజు డీసెంట్ టాక్ వచ్చింది. హాలిడే అడ్వాంటేజ్ తో డీసెంట్ ఓపెనింగ్స్ కూడా తీసుకుంది. కానీ 2వ రోజు నుండి కలెక్షన్స్ తగ్గాయి.

Sundarakanda Collections

ఆ తర్వాత వీకెండ్ కు కూడా సెట్ అయ్యింది లేదు. డబ్బింగ్ సినిమా ‘కొత్త లోక’ ప్రభావం ‘సుందరకాండ’ పై ఎక్కువగా పడటం వల్ల క్యాష్ చేసుకోలేకపోయింది అని చెప్పొచ్చు.ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.77 cr
సీడెడ్ 0.19 cr
ఆంధ్ర(టోటల్) 0.59 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.55 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.14 cr
ఓవర్సీస్ 0.24 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.93 cr (షేర్)

‘సుందరకాండ’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 7 రోజుల్లో ఈ సినిమా రూ.1.93 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.32 కోట్లను కలెక్ట్ చేసింది.బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.57 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి సోమవారం ఈ సినిమా కలెక్షన్స్ బాగా డౌన్ అవుతూ వచ్చాయి. ఇక కోలుకునే అవకాశం కనిపించడం లేదు.

ఈ అల్లు అర్జున్ బ్యూటీని గుర్తుపట్టారా…? బొద్దుగా అయినా ముద్దుగానే ఉందంటూ..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus