లాస్ట్ వీక్ రిలీజ్ లలో సందీప్ ఒక్కడే రీకవరీ సాధించాడు

  • July 16, 2019 / 11:16 AM IST

గత శుక్రవారం విడుదలైన “నిను వీడని నీడను నేనే, దొరసాని, రాజ్ దూత్” చిత్రాలు మూడిటికీ ఆశించిన స్థాయిలో స్పందన కానీ టాక్ కానీ రాలేదు. ఈ మూడిట్లో సందీప్ కిషన్ నటించిన “నిను వీడని నీడను నేనే” మాత్రం ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా ఆకట్టుకొంది. మిగతా రెండు సినిమాలకంటే బెటర్ అని తెలియడంతో జనాలు కూడా ఈ హారర్ థ్రిల్లర్ కి వెళ్లడానికే ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో “నిను వీడని నీడను నేనే” సినిమాకి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. మొదటివారంలోనే లాభాలు తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట.

దాంతో యావరేజ్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేసిన సందీప్ కిషన్ నందానికి అవధులు లేకుండాపోయాయి. కానీ.. ఈ సినిమాకి వచ్చిన హైప్ & అటెన్షన్ కి సెకండాఫ్ కూడా సరిగ్గా ప్లాన్ చేసుకొని ఉంటే సందీప్ కిషన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేది. కనీసం.. తన తదుపరి చిత్రాల విషయంలోనైనా సందీప్ జాగ్రత్తపడతాడేమో చూడాలి. ఇకపోతే.. గతవారం విడుదలైన మరో చిత్రం “దొరసాని, రాజ్ దూత్” చిత్రాలకు కనీస స్థాయి కలెక్షన్స్ కూడా రాకపోవడం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus