“వెంకటాద్రి ఎక్స్ ప్రెస్”తో తన కెరీర్ లో మొట్టమొదటి సూపర్ హిట్ ను సొంతం చేసుకొన్నాడు సందీప్ కిషన్. అదే సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకొని వరుస అవకాశాలతో దూసుకుపోతుండగా.. సందీప్ మాత్రం ఆ హిట్టు దగ్గరే ఆగిపోయాడు. అప్పట్నుంచి ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేసుకొంటూ వచ్చినా మనోడు ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు. మొన్నామధ్య వచ్చిన “రన్” కూడా ఎప్పుడు వచ్చిందో? కూడా తెలియానంత స్పీడ్ గా థియేటర్ల నుంచి “రన్” చేసుకొంటూ పారిపోయింది.
దాంతో.. తన తాజా చిత్రం “ఒక్క అమ్మాయి తప్ప”పై చాలా ఆశలు పెట్టుకొన్నాడు సందీప్ కిషన్. రాజసింహ అనే రచయిత దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంలో సందీప్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో నటించడానికి సందీప్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. అలాగే తన మేనమామ ఛోటా కె.నాయుడు కూడా ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా ఫ్రీగా పనిచేశాడట. అంతేకాకుండా నిత్యామీనన్ కూడా తాను తీసుకొనే రెమ్యుణరేషన్ లో సాగమే ఈ సినిమా కోసం తీసుకొండట.