రి ఎంట్రీ తో వచ్చిన సునీల్ కి మరొకసారి కూడా నిరాశనే మిగిలింది

Advertisement

సునీల్ ఒకప్పుడు టాలీవుడ్ లో బిజీ కమెడియన్. సునీల్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్లో మంచి కమిడియన్ గా పేరు సంపాదించాడు. ఇలా క్రేజ్ వచ్చిన తరువాత సునీల్ మెల్లిగా హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసాడు. కానీ వరుస పరాజయాలతో కెరియర్ ని ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో పడిపోయాడు. కొందరి సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కమెడియన్ గా కొనసాగితే ఇప్పటికే ఆయన కెరియర్ ఒక రేంజులో ఉండేదని అంటున్నారు. ఇలా హీరోగా కలసి రాకపోవడంతో సునీల్ మళ్ళీ తన రూట్ ని మార్చుకున్నాడు.

ఇక తనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన డైరెక్టర్ త్రివిక్రమ్ తోనే మళ్ళీ పాత ఫామ్ లోకి వెళ్లాలని భావించిన సునీల్ కి ‘అరవింద సమేత’ లో త్రివిక్రమ్ ఒక క్యారెక్టర్ ని ఇచ్చి ఎంకరేజ్ చేసాడు. కానీ ఈ సినిమాలో సునీల్ క్యారెక్టర్ అంతగా లేకపోవడంతో మళ్ళీ కథ మొదటికే వచ్చింది. అయితే ‘ఢీ’ ‘దుబాయ్ శ్రీను’ వంటి సినిమాల్లో మంచి రోల్స్ ఇచ్చిన శ్రీనువైట్ల పైన నమ్మకంతో ‘అమర్ అక్బర్ అంథోని’ సినిమాలో నటించాడు. కానీ ఇందులో సునీల్ కంటే ఎక్కువగా కమెడియన్ సత్య కి మంచి రోల్ ఉందని, ఈ సినిమా కూడా సునీల్ కెరియర్ కి కలసి రాలేదంటూ కొందరి అభిప్రాయం. ఇక కెరియర్ పరంగా అయోమయం లో ఉన్న సునీల్ కి మంచి విజయం ఎప్పడు వరిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news