చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్లో సునీల్!

  • November 5, 2018 / 07:47 AM IST

హీరోగా సూపర్ స్టార్ డమ్ కోసం ప్రయత్నించి అనవసరంగా కెరీర్ ను పాడు చేసుకొన్నాడు కానీ.. సునీల్ కేవలం హీరో రోల్స్ కి పరిమితం కాకుండా కమెడియన్ గా చేస్తూనే హీరోగానూ కంటిన్యూ అయ్యుంటే ఈపాటికి సునీల్ రేంజ్ వేరేలా ఉండేది. అయితేనేం.. తన స్నేహితుడు త్రివిక్రమ్ పుణ్యమా అని మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సునీల్ “అరవింద సమేత” చిత్రంతో తన ఉనికిని చాటుకొన్నాడు. ఇప్పుడు “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రంతో ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించి కడుపుబ్బ నవ్వించనున్నాడు సునీల్. రవితేజ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అమర్ అక్బర్ ఆంటోనీ”లో రవితేజ అసిస్టెంట్ గా కనిపించనున్నాడట సునీల్.

ఈ సినిమాలో సునీల్ కామెడీ మెయిన్ హైలైట్ గా నిలవనుందట. ఈ విషయాన్ని సునీల్ తన స్నేహితులతో చెబుతున్నాడు. నిన్నమొన్నటివరకు ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు కానీ.. టీజర్ మరియు ఫస్ట్ సాంగ్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. రవితేజ-శ్రీనువైట్ల కాంబో ఆ అంచనాలను అందుకోగలుగుతుందో లేదో తెలియదు కానీ.. రవితేజ అభిమానులు మాత్రం సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. నవంబర్ 16న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus