మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హాస్యనటుడు, హీరో సునీల్ సినీ పరిశ్రమలోకి రాక మునుపే మంచి ఫ్రెండ్స్. ఒకే గదిలో ఉంటూ అవకాశాల కోసం తిరిగేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి స్నేహం కొనసాగుతోంది. సునీల్ హాస్యనటుడిగా ఉన్నప్పుడు తన సినిమాల్లో అతనికి మంచి రోల్ ఇచ్చేవారు త్రివిక్రమ్. అతడు, జల్సా, ఖలేజా తదితర చిత్రాల్లో సునీల్ నవ్వులు పూయించారు. హీరో గా మారిన తర్వాత చిన్న పాత్రలు వేయడానికి వెనకడుగు వేశారు. ఇప్పుడు అతని చిత్రాలు వరుసగా ఫెయిల్ అవుతుండడంతో హాస్య నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
అందుకు త్రివిక్రమ్ తన దర్శకత్వంలో రానున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీలో మంచి రోల్ క్రియేట్ చేశారు. పవన్ కి ఫ్రెండ్ గా ఉంటూ నవ్వించే అవకాశాన్ని సునీల్ కి ఇచ్చినట్లు సమాచారం మాటల మాంత్రికుడు, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’ విజయం సాధించగా, ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో వీరి కలయికలో వచ్చే మూడో మూవీ పై భారీ క్రేజ్ ఏర్పడింది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత ఎస్. రాధ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్ ‘కాటమరాయుడు’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ తో కలిసి పయనించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.