టెంపర్ తమిళ రీమేక్ లో ఐటెమ్ సాంగ్ కోసం హడావుడి

ఇదివరకు ముమైత్ ఖాన్, అభినయశ్రీ, రచనా మౌర్య లాంటి ఐటెమ్ సాంగ్ స్పెషలిస్ట్స్ కి మంచి డిమాండ్ ఉండేది. కానీ.. రానురాను హీరోయిన్లే డబ్బుల కోసం ఐటెమ్ సాంగ్స్ చేయడానికి ఉత్సాహం చూపడంతో వాళ్ళకి అవకాశాలు తగ్గిపోయాయి. హీరోయిన్లు ఐటెమ్ సాంగ్స్ తో రచ్చ లేపుతున్న తరుణంలోనే సన్నీలియోన్ రంగంలోకి దూకింది. అప్పటివరకూ ఆమె కేవలం బాలీవుడ్ కి మాత్రమే అంకితం అవ్వగా.. తెలుగులో మంచు మనోజ్ “కరెంట్ తీగ”లో ఒక హాట్ సాంగ్ లో మెరిసింది. ఆ తర్వాత “గరుడ వేగ”లోనూ డియో డిసక అని రెచ్చిపోయింది. అమ్మడి వల్ల సినిమాకి బిజినెస్ వేల్యూ యాడ్ అవుతుందని నిర్మాతలు కూడా కన్సిడర్ చేద్దామనుకున్నారు కానీ.. ఒక పాటకి అమ్మడు ఏకంగా 50 లక్షలు అడగడమే కాక.. షూటింగ్ టైమ్ లో అమ్మడి డిమాండ్స్ భారీగా ఉండడంతో భయపడ్డారు మన ప్రొడ్యూసర్స్.

కానీ.. విశాల్ మాత్రం తనకు సన్నీలియోన్ కావాలని పట్టుబడుతున్నాడట. టెంపర్ రీమేక్ గా విశాల్ నటిస్తున్న “అయోగ్య”లో ఒక ఐటెమ్ సాంగ్ ఉంది. “సరైనోడు” సినిమాలోని “బ్లాక్ బస్టర్” సాంగ్ ను ఐటెమ్ సాంగ్ కోసం తీసుకున్న విశాల్.. ఆ పాటలో సన్నీలియోన్ చేత డ్యాన్స్ చేయించాలనుకుంటున్నాడు. మరి నిర్మాతలు అంగీకరిస్తే సన్నీ మళ్ళీ మన సౌత్ స్క్రీన్ పై మెరుస్తుందన్నమాట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus