‘నో’ హాట్ అంటున్న సన్నీ!!

పోర్న్ బేబీ సన్నీ లియోన్…మనసు మార్చుకుంది…ఏ ముహుర్తాన బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిందో కాని అప్పటి నుండి ఈ అమ్మడులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పోర్న్ ఫీల్డ్ వదిలి…బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన తొలి రోజుల్లో కాస్త స్పైసీ నెస్ ఎక్కువగా ఉండేలా చూసుకున్న అమ్మడు రాను రాను సినిమాల్లో నటించడం కూడా నేర్చుకుంది. అంతేకాకుండా కొద్దికొద్దిగా ‘స్పైసీ నెస్’ను తగ్గించుకుంటూ…రానున్న రోజుల్లో అసలు హాట్ మూవీస్ జోకిలి పోనంటూ మాస్ హృదయాలకు గాయం చేసింది. ఈ వార్త వినగానే ఆమె హ్యాట్ ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు…అయితే దీనికి కారణం ఏంటంటే….

ఇప్పుడు ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటిస్తుంది కాబట్టి బడా హీరోల సినిమాల్లో స్పైసీ సీన్స్ ఉంటే ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమా చూసే అవకాశం ఉండదు అందుకే సన్ని ఈ నిర్ణయం తీసుకుంది అని బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో వినిపిస్తున్న వాదన. అదే క్రమంలో..తనని “అలా”ఆశగా చూడాలనుకునే అభిమానుల కోసం మంచి కథలు దొరికితే నటిస్తా, స్పైసీ సినిమాలు సైతం ఒప్పుకుంటా అని వాళ్ళని స్యాటిస్ఫై చేసింది..ఇక తెలుగులో మంచు మనోజ్ ‘కరెంటు తీగ’ సినిమాలో నటించిన సన్నికి వరుసగా తెలుగులో సైతం ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. మరి సన్ని తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులకు బాధనిపించినా ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం హమ్మయ్య అని అనుకుంటున్నారు. చూద్దాం ఈ అమ్మడు తన మాటను ఎంతవరకూ నిలబెట్టుకుంటుందో…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus