అడవి బాట పట్టిన మహేష్ బాబు..!

‘భరత్ అనే నేను’ చిత్రం తరువాత మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు,అశ్వినీ దత్, ప్రసాద్ వి పొట్లూరి కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 9 న విడుదల కానుంది. అల్ల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది మహేష్ 25 వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్ల్లో తన 26 వ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్.

ఇక ఓ పక్కన సినిమాలు చేస్తూనే మరో పక్క యాడ్స్ కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నాడు మహేష్. ఎండలు మండుతున్న ఈ సమయంలో మహేష్ ప్రస్తుతం అడవుల్లో ఉన్నాడట. ప్ర. ఎంత కాదనుకున్నా మహేష్ ఏడాది సంపాదన 30 నుండీ 40 కోట్ల వరకూ ఉంటుందని వారు చెబుతున్నారు. ఇప్పటికే టాలీవడ్ నుండీ ఎక్కువ సంపాదిస్తున్న వారిలో మహేష్ బాబు ప్రఖ్యాత ఫోబ్స్ లిస్ట్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఓ పక్క తన అభిమానుల కోసం సినిమాల్లోనూ… తన కుటుంబం కోసం మరో పక్క యాడ్స్ లోనూ నటిస్తూ మహేష్ చేతినిండా సంపాదిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus