Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

సురేఖ వాణి (Surekha Vani) కూతురు సుప్రీత నాయుడు (Supritha)  అందరికీ సుపరిచితమే. ఇప్పటివరకు సోషల్ మీడియాలో సందడి చేస్తూ వచ్చింది. కొన్నాళ్లుగా బుల్లితెరపై టెలికాస్ట్ అయ్యే షోలలో అలాగే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే షోలలో కూడా సందడి చేస్తుంది. ముందుగా తన తల్లితో కలిసి డాన్సులు వేసిన వీడియోలు… వంటివి షేర్ చేస్తూ లక్షల్లో ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. సురేఖ వాణికి కూడా సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే.

Supritha

వీళ్ళు చేసే వీడియోలు ఎంత వైరల్ అవుతాయో.. అంతే వివాదాస్పదం కూడా అవుతాయి. భర్త చనిపోయిన తర్వాత సురేఖ వాణి చాలా డిస్టర్బ్ అయ్యింది. సినిమాలు చేయడం తగ్గించేసింది. అందువల్ల ఈమె సంపాదన కూడా తగ్గింది. అయితే కూతురితో కలిసి ఫారిన్ ట్రిప్ లు వంటివి ఎలా ఇస్తుంది? వాటికి గాను ఈమెకు డబ్బులు ఎలా వస్తున్నాయి? అంటూ కొంతమంది వీరిపై నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తూ వస్తున్నారు.

తాజాగా వీటికి క్లారిటీ ఇచ్చింది సుప్రీత. తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫాలోవర్స్ కారణంగా.. పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ తానూ సంపాదిస్తుందట. అలా వచ్చిన డబ్బుల్లో కొంత తన తల్లికి ఇచ్చేస్తోందట. మిగిలిన డబ్బులతో ట్రిప్..లు వంటివి వేస్తారట.వర్క్ ప్రెజర్ లో కొంచెం రిలాక్స్ అవ్వాలని భావించి మేము ట్రిప్పులు అవి వేస్తున్నాం.

మాకు ఉన్న స్తోమతలోనే మేము ట్రిప్పులు వంటివి వేస్తున్నాం. మాకు ఉన్న ఈ స్పేస్ లోనే ఎంజాయ్ చేయాలి. మేము మాత్రమే కాదు.. మిగిలిన వారు కూడా తమ ప్రాబ్లమ్స్ ను పక్కన పెట్టేసి.. ఇలాంటి ట్రిప్..లు వంటివి వేస్తూ ఉండాలి. చిన్న లైఫ్ మనది. ఇలాంటి మెమోరీస్ లేకపోతే ఎలా..! అంటూ తెలిపింది సుప్రీత.

ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus