ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ డైరెక్టర్ ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు..!

  • November 19, 2019 / 06:05 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో సురేందర్ రెడ్డి కూడా ఒకరు. స్టైలిష్ యాక్షన్ ఎంటెర్టైనెర్లను తెరకెక్కించడంతో పాటు చారిత్రాత్మక సినిమాల్ని కూడా తెరకెక్కించగలను అని ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో ప్రూవ్ చేసాడు. 15 ఏళ్ళ కెరీర్లో సురేందర్ రెడ్డి సాధించిన హిట్లు ఎన్నున్నాయో.. ప్లాపులు కూడా అన్నే ఉన్నాయని చెప్పాలి. ఇదిలా ఉంటే… తాజాగా ఈ డైరెక్టర్ ను ఎన్టీఆర్ అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఇటీవల.. ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్.. సురేందర్ రెడ్డి పై చేసిన కామెంట్స్ అనే చెప్పాలి.

సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ” ‘అతనొక్కడే’ సినిమా తరువాత నేను.. ప్రభాస్ తో సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాను.ఈ సినిమాకి సన్నాహాలు జరుగుతుండగా..అప్పటి ఎన్టీఆర్ మేనేజర్ సుకుమార్ అని ఒకాయన ఉన్నాడు. ఆయన రెండు, మూడు రోజులపాటు తన వెంటపడి ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఒప్పించాడు. నేను ఏ విషయం చెప్పకుండానే సినిమా ఎలా చేయాలి, ఎక్కడ చేయాలనే విషయాలు మాట్లాడడంతో నాకు ఇబ్బందికరంగా అనిపించినా.. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేయకపోతే ఏం జరుగుతుందనే ఆలోచనతో ఇష్టంలేకుండానే సినిమా చేయడానికి అంగీకరించాను. ఆ సమయంలో ‘అశోక్’ కథ నా చేతుల్లో పెట్టారు. అయితే తను ప్రభాస్ కోసం అనుకున్న కథ మరో రకమైన కథ. ‘అశోక్’ కథ నాకు సెట్ కాదని అనిపించింనా.. సినిమా చేయక తప్పని పరిస్థితుల్లో చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు.


తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus