తన కొడుకు విషయంలో సురేష్ బాబు ఆలోచన మారదు.!

చిత్ర సీమలో తనకు ఆశ చూపి వాడుకున్నారని నటి శ్రీరెడ్డి కొంతమంది పేర్లను బయటపెట్టింది. ఆ జాబితాలో ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ ఉండడం సంచలనం అయింది. పైగా ముద్దు పెట్టుకుంటున్న ఫోటో మీడియాలో హల్ చల్ చేసింది. అందుకు తండ్రి కొడుకుల వెర్షన్ ఏంటో తెలుసుకోవాలని మీడియా చాలా ప్రయత్నించింది. కానీ సురేష్ మీడియా ముందుకు రాలేదు. ఇలా మౌనంగా ఉండడం వెనుక చాలా ప్లాన్ ఉందని సమాచారం. అతను స్పందించి ఉంటే రచ్చ చేసేవాళ్ళు. తెలియని వాళ్ళకి కూడా తెలిసేది. అలాగే శ్రీ రెడ్డికి ఐదు కోట్లు ఇవ్వాలని ఆలోచనను కూడా సురేష్ బాబు తిరస్కరించినట్లు తెలిసింది.

త్రిపురనేని వరప్రసాద్ అలియాస్ చిట్టి సురేష్ బాబుకి మంచి స్నేహితుడు. రామ్ గోపాల్ వర్మ ఐదు కోట్లు ఇవ్వడానికి మాట్లాడాడని తెలియగానే చిట్టి సురేష్ బాబుకి కాల్ చేసాడట. మధ్యవర్తుల ద్వారా ఇలాంటివి పరిష్కరించుకోవడం ప్రోత్సహించనని, ఏదైనా సరే చట్టప్రకారంగా వెళ్లడానికే ఇష్టపడతానని సురేష్ బాబు చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. శ్రీరెడ్డి విషయంలో అభిరామ్ ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా ఉండొచ్చని, ఒకవేళ ఏదైనా ఉంటే మాత్రం దాన్ని ఫేస్ చేయాల్సిన బాధ్యత అతనిదే అని కూడా సురేష్ బాబు చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ  సురేష్ బాబు నోరు విప్పితేనే తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus