శ్రీదేవి మృతికి సర్జరీలు కారణం కాదు – ఏక్తా కపూర్‌

  • February 27, 2018 / 06:25 AM IST

కోట్లాది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి హఠాన్మరణం అందరినీ షాక్ కి గురిచేసింది. ఆమె కుటుంబసభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయి ఉంటే కొన్ని ఛానళ్ల వాళ్లు రకరకాల కథనాలను ప్రసారం చేస్తున్నారు. అవి చాలామందిని బాధకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా శ్రీదేవి మరణానికి ఆమె అందంగా ఉండడానికి చేసుకున్నసర్జరీలే కారణమని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తపై బుల్లితెర నిర్మాత ఏక్తా కపూర్‌ మండిపడ్డారు. “సర్జరీలు చేయించుకోవటం వల్లే గుండెపోటు వచ్చిందనడం సరికాదు. ఎలాంటి గుండె సమస్యలు లేకున్నా కొన్ని సందర్భాల్లో గుండెపోటు రావచ్చు.

అలాగే గుండెపోటుకు సర్జరీలతో సంబంధం లేదు. ఈ విషయాల్ని నాకు తెలిసిన ఓ వైద్యుడు తెలిపాడు. దయచేసి రాక్షసుల్లా మాట్లాడకండి. శ్రీదేవి మృతి గురించి ఏవేవో ఊహించుకొని కంగారు పడకండి. దృఢమైన మహిళల హృదయాలు బలహీనంగానే ఉంటాయి. పుట్టుక, చావు అనేది విధిరాత” అని ఏక్తా కపూర్ ఘాటుగా స్పందించారు. దీంతో శ్రీదేవి మృతిపై కామెంట్స్ చేసేవారు వెనక్కి తగ్గారు. తాజాగా ఆమె మరణంపై దుబాయి పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం, ఆమె భర్త బోనీ కపూర్ పాస్ పోర్ట్ ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో కొత్త చర్చలకు సోషల్ మీడియా వేదికైంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus