కింగ్ నాగార్జున తో ఫైట్ చేయనున్న సూర్య

  • January 25, 2017 / 01:12 PM IST

తమిళ నటుడు సూర్య, టాలీవుడ్ కింగ్ నాగార్జునతో తలపడేందుకు సిద్ధమయ్యారు. నాగ్ చిత్రానికి పోటీగా తాను నటించిన సింగం 3 రిలీజ్ చేస్తున్నారు. సూర్య సింగం సిరీస్ బాగా సక్సస్ అయింది. ఈ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే  సింగం 3 పై భారీ అంచనాలను చిత్ర బృందం పెట్టుకుంది. డిసెంబర్ 13 న రావాల్సిన ఈ మూవీ పెద్ద నోట్ల రద్దు తో పోస్ట్ పోన్ అయింది. ఆ తరవాత జనవరి 26 రిలీజ్ చేయాలనీ సూర్య అనుకున్నారు. ఈ సమయంలో జల్లికట్టు ఉద్యమం తమిళనాడు లో ఉదృతం కావడంతో విడుదలను వాయిదా వేశారు.

చివరికి ఫిబ్రవరి 9 న ఫిక్స్ అయ్యారు. ఆరోజు సింగం 3 థియేటర్లలోకి వస్తుందని సూర్య స్పష్టం చేశారు. ఫిబ్రవరి 10 న నాగార్జున నటించిన భక్తిరస చిత్రం “ఓం నమో వెంకటేశాయ” రిలీజ్ కానుంది. ఇలా ఇద్దరూ పోటీ పడనున్నారు. ఇందులో గెలుపెవరిదో కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus