బాలీవుడ్ లో సూర్య సినిమా..?

Advertisement

దక్షిణాదిన మంచి క్రేజ్ వచ్చిన చిత్రాలను బాలీవుడ్ లో నిర్మించడం సాధారణ విషయం అయిపోయింది. ఇదే క్రమంలో సూర్య నటిస్తోన్న ’24’ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేయబోతున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతోంది. ఇటీవల విడుదలయిన ఈ చిత్రం టీజర్ కు ఊహించని స్పందన లభించింది. దీంతో ఈ సినిమాపై సూర్య కు మరింత నమ్మకం ఏర్పడి తనే స్వయంగా బాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. హీరోగా హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేయనున్నాడు. వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus