సమ్మర్ బరిలో నిలవనున్న సూర్య..!

  • November 2, 2016 / 11:01 AM IST

పరిశ్రమ కళకళలాడుతూ ఉండాలంటే చిన్న పెద్ద హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తుండాలని పెద్దలు చెబుతుంటారు. ఎవరి మాటేమో గానీ ప్రస్తుతం సూర్య అదే అనుసరిస్తున్నట్టున్నాడు. స్టార్ హీరోల సినిమాలు సంవత్సరానికి ఒకటి వస్తేనే గగనం అనుకునే రోజులివి. అలాంటిది ప్రయోగాత్మక కథలు, కమర్షియల్ సినిమాలు అన్న తేడాలేవీ లేకుండా అన్నిటికీ న్యాయం చేస్తున్న సూర్య ఇప్పుడు మరింత వేగం పుంజుకున్నాడని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

ఈ వేసవికి ’24’ వంటి సైంటిఫిక్ థ్రిల్లర్ ని తెరపైకి తీసుకొచ్చిన సూర్య క్యాలెండర్ మారేలోపు ‘సింగం’ గా గర్జించనున్నాడు. హరి దర్శకత్వంలో ‘సింగం’ సినిమా మూడో భాగమైన ‘సింగం 3’ డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టాడో లేదో వెంటనే మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు ఈ కార్తీ సోదరుడు. ‘నానుమ్ రౌడీదాన్’ తో తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన విగ్నేష్ శివన్ దర్శకుడిగా సూర్య నటించనున్న ‘తానా సెర్న్ దా కూట్టమ్’ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభం అయ్యింది. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సైతం వీలైనంత త్వరగా పూర్తి చేసి వేసవిలో విడుదల చేయాలని చిత్ర బృందం తీర్మానించుకున్నారట. నాలుగు నెలల్లో స్టార్ హీరో సినిమాని ముస్తాబు చేయడం అంటే మాటలు కాదు కదా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus