సూర్య ఇది నిజమేనా!!!

తమిళ సూపర్ హీరో సూర్య అంటే మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఎనలేని అభిమానం. ఆయన సినిమాల్లో యముడు, సింగం రెండు సినిమాలు తమిళంలోనే కాదు, తెలుగులో కూడా మంచి స్టేటస్ సాధించి సూర్యను మరింత దగ్గర చేశాయి. అయితే ప్రయోగాలకు కూడా ఏమాత్రం వెనకాడని సూర్య చాలా డిఫరెంట్ సినిమాలు చేస్తూ అటు అభిమానులని, తమిళ తంబీలని మాత్రమే కాకుండా మన తెలుగు ప్రేక్షకులను సైతం అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తమిళ ఇండస్ట్రీ మొత్తం సూర్య గురించే మాట్లాడుకుంటుంది అని తమిళ తంబీలు చెబుతున్నారు…ఎందుకా అంటే మాత్రం ఈ కధ చదవాల్సిందే…విషయంలో వెళితే….హీరో సూర్య విఘ్నేష్ శివన్ అనే దర్శకుడు…ఇంకా మీకు అర్ధం కావాలి అంటే నయన తార బోయ్ ఫ్రెండ్ తో కలసి ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఆ సినిమాను సూర్య ఎందుకు ఒప్పుకున్నాడు అన్న మ్యాటర్ పై ఇప్పుడు అక్కడ చర్చ మొదలయింది….అసలు హీరో సూర్య కేవలం విఘ్నేష్ శివన్ చెప్పిన కథ వలన అతనికి సినిమా ఇచ్చాడా లేకపోతే అతని ప్రియురాలు నయనతార రికమండ్ చేసింది కాబట్టి సినిమా ఇచ్చాడా అంటూ ఎవరికి వారు తమకు నచ్చిన విధంగా మాట్లాడుకుంటున్నారు. సూర్య సైడ్ నుంచి చూస్తే….ఒక వర్షన్, దర్శకుడు విఘ్నేష్ ఫ్యాన్స్ సైడ్ నుంచి చూస్తే మరొక వర్షన్ వినిపిస్తూ ఉండడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు సామాన్య ప్రేక్షకులు.

అయితే ”నానుం రౌడీ ధాన్” సినిమా విఘ్నేష్ చాలా బాగా తీశాడు….అందులో నయనతార క్యారెక్టర్ అద్భుతం, అంతేకాదు హీరో విజయ్ సేతుపతి – అతని తల్లి పాత్రలో నటించిన రాధిక క్యారక్టర్లు కూడా సూపర్ గా మలిచాడు దర్శకుడు. అందుకే అటువంటి ప్రాజెక్టు డెలివర్ చేసిన విఘ్నేష్ కు సూర్య వంటి హీరో సినిమా ఆఫర్ ఇచ్చాడు తప్పా…నయన ఏదో చెప్పింది అని మాత్రం కాదు అని ఇట్టే అర్ధం అయిపోతుంది. మరి ఇందులో నయన పాత్ర ఏమయినా ఉంది అంటే..కేవలం ఆ అమ్మడు తన పవర్ తో మహా అయితే ఒక అప్పాయింట్మెంట్ ఇప్పించి ఉండొచ్చు అంతే. ..

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus