“నయన్”కు “నో” చెబుతున్న టాప్ హీరో??

టాలీవుడ్ ను ఒక దుమ్ము దులిపి…ఆ క్రమంలో సింభూతో…కొన్నాళ్ళు…అటుపై డ్యాన్స్ మాస్టర్ ప్రభు దేవతో మరి కొన్నాళ్ళు ప్రేమ పాటలు పాడి అటుపై ఇద్దరినీ వదిలేసి మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది సెక్సీ బ్యూటీ నయన తార. తాజాగా ప్రభు దేవతో లవ్ ఫేల్యూర్ అయిన తరువాత పూర్తిగా తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన నయనతార వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. అదే క్రమంలో ఇప్పుడు తమిళంలో నయన పరిస్థితి ఎలా ఉంది అంటే….ఆమె ఎంత అడిగితే అంటే రెమ్యునిరేషన్ ఇచ్చి మరీ ఆమెను సినిమా తీసుకునే అందుకు అందరు నిర్మాతలు…దర్శకులు రెడీ. అయితే అంతవరకూ ఎలా ఉన్నా…తాజాగా తమిళ టాప్ హీరో సూర్య నయన తార ను తన సినిమాలో వద్దు అంటూ నో చెప్పాడు. ఇంతకీ ఏంటి అంటే….సింగం సిరీస్ లో మూడో పార్ట్ ని ఫినిష్ చేస్తున్న సూర్య.. తన నెక్ట్స్ మూవీని కూడా ఫైనల్ చేసేసుకున్నాడు. నయనతార లవర్ కం డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కి.. నయన్ రికమెండేషన్ తో ఆఫర్ ఇచ్చేశాడు.

అయితే.. ఇప్పుడీ దర్శకుడు నయన్ ని హీరోయిన్ గా తీసుకోవాలని పట్టుబడుతుంటే.. సూర్య మాత్రం కుదరదంటున్నాడట. దానికి గల కారణం ఏంటి అంటే….గజని హిట్ తరువాత వరుస నయనతో కొన్ని సినిమాలు చేసిన సూర్య వరుస ఫ్లాప్స్ అందుకోవడం…ఆమెను నో అంటున్నాడు…అయితే దర్శకుడు మాత్రం ఈ సినిమాలో నయనతార అయితేనే.. కేరక్టర్ కి న్యాయం చేయగలదని వాదిస్తున్నాడట. ఇక్కడ గమ్మత్తు అయిన విషయం ఏమిటి అంటే…ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా సూర్యనే కావడంతో….దర్శకుడు కాస్త వెనకడుగు వేస్తున్నాడు అట….మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus