మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై రాంచరణ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2 న(నిన్న) విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రకి మెగాస్టార్ వందకు వంద శాతం న్యాయం చేశారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ బ్లాక్.. అద్భుతంగా వచ్చింది అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అయితే అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి కానీ మిగిలిన భాషల్లో మాత్రం కలెక్షన్లు రావట్లేదనే చెప్పాలి.
ఇక ‘సైరా నరసింహారెడ్డి’ 2 వారాల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 26.87 cr |
సీడెడ్ | 17.40 cr |
ఉత్తరాంధ్ర | 11.86 cr |
ఈస్ట్ | 8.23 cr |
వెస్ట్ | 6.30 cr |
కృష్ణా | 7.29 cr |
గుంటూరు | 9.25 cr |
నెల్లూరు | 4.01 cr |
ఏపీ + తెలంగాణ | 91.21 cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 22.11 cr |
ఓవర్సీస్ | 13.45 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 126.77 cr (షేర్) |
‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి 200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 14 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 126.77 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే ఇంకా ఈ చిత్రం 74 కోట్ల షేర్ వరకూ రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అద్భుతంగా కలెక్ట్ చేస్తుంది.. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఓవర్సీస్, హిందీ,తమిళ, మలయాళం భాషల్లో ఈ చిత్రం కలెక్షన్స్ అస్సలు లేవనే చెప్పాలి. దసరా సెలవులు పూర్తయ్యాయి. ఇక సోమవారం నుండీ కలెక్షన్లు చాలా పూర్ గా ఉన్నాయి. కొన్ని రికార్డులు అయితే ‘సైరా’ బద్దలుకొట్టింది. కానీ మొత్తంగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి. ఎంతకాదనుకున్నా 40 నుండీ 45 కోట్ల వరకూ నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో ఈ చిత్రానికి 130 కోట్ల వరకూ వచ్చాయి.
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?