‘సైరా’ కి బాలీవుడ్ సపోర్ట్ గట్టిగానే ఉందిగా..!

  • September 20, 2019 / 05:30 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి 151 వ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం మరో 12 రోజుల్లో అంటే అక్టోబర్ 2 న విడుదల కాబోతుంది. సురేందర్‌ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ,హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం కోసం మెగా అభిమానులే కాదు యావత్ ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా వైడ్ బాలీవుడ్ మార్కెట్ చాలా పెద్దది. అందులోనూ భారీ బడ్జెట్ చిత్రానికి ఇప్పుడు హిందీ మార్కెట్ చాలా కీలకంగా మారింది. ‘సాహో’ చిత్రం ప్లాపయినప్పటికీ హిందీలో హిట్ గా నిలిచింది. అక్కడి స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ఈ చిత్రం అక్కడ కలెక్షన్ల వర్షం కురిపించింది. అందుకే ‘సైరా’ చిత్రాన్ని కూడా బాలీవుడ్ లో బలంగా ప్రమోట్ చేయాలని చిరంజీవి, చరణ్ లు డిసైడ్ అయ్యారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా కొంతమంది బాలీవుడ్ ప్రముఖలకు అలాగే స్టార్ హీరోలకి ‘ సైరా’ విడుదలకు ముందుగానే స్పెషల్ షో వేయాలనే ఆలోచనలో ఉన్నారట ‘సైరా’ చిత్ర యూనిట్ సభ్యులు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కి ‘సైరా’ ప్రమోషన్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమీర్ ఖాన్ కూడా ‘సైరా’ ట్రైలర్ అద్భుతం అంటూ ట్వీట్ చేశాడు. ఆమీర్ కు ముందుగానే హృతిక్ కూడా ‘సైరా’ గురించి అలాగే చిరంజీవి గురించి ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇక ‘సైరా’ లో బిగ్ బి అమితాబ్ ఓ స్పెషల్ రోల్ కూడా ప్లే చేశారు. కాబట్టి ‘సైరా’ కి బాలీవుడ్ సపోర్ట్ గట్టిగానే ఉంది. దీంతో ‘బాహుబలి’ రేంజ్లో అక్కడ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus