‘సాహో’ పైనే ‘సైరా’ ఫ్యూచర్ డిపెండ్ అయ్యుందంట..!

  • August 22, 2019 / 06:06 PM IST

అవును ‘సాహో’ విజయం టాలీవుడ్ కు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకూ ఒక్క ‘బాహుబలి’ చిత్రం పక్కన పెడితే టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు అస్సలు లేవు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు కూడా తమ చిత్రాల్ని 70-80 కోట్ల బడ్జెట్ తోనే ముగించేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్, సుజీత్ లు ఆ సాహసం చేశారు. ‘బాహుబలి’ తో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కొంతమంది నెటిజన్లు ఈ విషయాన్ని కామెడీ చేస్తునా కానీ ఇది నిజమే..! ‘బాహుబలి’ చిత్రం ఏ హీరో చేసినా ఇంత క్రేజ్ సంపాదించుకునే అవకాశం లేదు. కాబట్టి ప్రభాస్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ‘సాహో’ కి ఏకంగా 350కోట్ల బడ్జెట్ పెట్టారు నిర్మాతలు.

హాలీవుడ్ స్థాయి యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఈ చిత్రం విజయం టాలీవుడ్ కి చాలా అవసరం. తరువాత రానున్న ‘సైరా’ , ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాలకి ఇది అదనపు ఎడ్వాంటేజ్ అవుతుంది. ఒక వేళ ‘సాహో’ ప్లాపయితే ఆ ఫలితం ‘సైరా’ బిజినెస్ పై పడుతుంది. ‘బాహుబలి’ ని చూసి చేసి చేతులు కాల్చుకోవడమే అనే కామెంట్స్ కూడా వస్తాయి. బాలీవుడ్ విశ్లేషకులు కూడా తెలుగు సినిమా పై మరిన్ని సెటైర్లు వేసే ప్రమాదం ఉంటుంది. ‘సైరా’ చిత్రం బిజినెస్ పై కూడా ఈ ప్లాప్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ‘సాహో’ హిట్టవడం ‘సైరా’ కి చాలా అవసరం. మరి చివరికి ఏమవుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus