పోస్టర్స్ తో పిచ్చెక్కిస్తున్న సైరా టీం

  • August 20, 2018 / 07:35 AM IST

చిరంజీవి 150వ సినిమా విడుదలై ఏడాదిన్నర పూర్తవుతుంది, ఆయన 151వ చిత్రమైన “సైరా నరసింహారెడ్డి” అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ ఇచ్చి కూడా ఏడాది కావస్తోంది. సినిమా మొదలైనప్పుడు ఉన్నంత ఊపు కానీ హంగామా కానీ ఎనౌన్స్ మెంట్ తర్వాత లేదు. దాంతో మెగా అభిమానుల ఆశలన్నీ నీరుగారుతూ వచ్చాయి. మళ్ళీ కొన్ని నెలల క్రితం సురేందర్ రెడ్డి మొత్తం టీం ని మళ్ళీ రీసెట్ చేసి షూట్ స్టార్ట్ చేశాడు. ముందు ప్రకటించినట్లుగా సంగీత దర్శకుడు రెహమాన్, కెమెరామెన్ రవివర్మన్ లను అమిత్ త్రివేది, రత్నవేలు రీప్లేస్ చేయగా.. నయనతార, విజయ్ సేతుపతి మాత్రం షూట్ కి వచ్చారు. షూట్ స్టార్ట్ అయ్యాక కొన్ని ఫోటోలు లీక్ అయినప్పటికీ.. ఫస్ట్ లుక్ రాకపోవడంతో అభిమానులందరూ ఫస్ట్ లుక్ ఎప్పుడా అని ఎదురుచూడడం మొదలెట్టారు.

అయితే.. సడన్ గా ఆగస్ట్ 15వ తారీఖున టీజర్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చేసరికి షాక్ అయ్యారు జనాలు. రేపు విడుదలవుతున్న టీజర్ గురించి టీం విడుదల చేస్తున్న పోస్టర్స్ మాత్రం క్రేజీగా ఉన్నాయి. చిరంజీవి ముఖం చూపించకుండా కేవలం ఆయన కత్తి, బ్యాగ్రౌండ్ లో రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ విశేషమైన ఆసక్తి రేపుతున్నాయి. రేపు విడుదలవ్వబోతున్న టీజర్ ఎలా ఉండబోతోందా అనే విషయం గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి టీజర్ లో మెగాస్టార్ ఎలా కనిపించబోతున్నాడు, సురేందర్ రెడ్డి మరోమారు తన మేకింగ్ తో మెస్మరైజ్ చేయనున్నాడా? అనేది తెలియాలంటే రేపు ఉదయం 11.30 వరకూ వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus