ఒక్కరోజులో కోటి వ్యూస్ సాధించిన సైరా టీజర్

  • August 22, 2018 / 12:09 PM IST

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ టీజర్ నిన్న రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. చిరు నటన, సురేందర్ రెడ్డి టేకింగ్, అమిత్ త్రివేది సంగీతం, రత్నవేలు విజువల్స్ అన్ని కలిసి అద్భుత వీడియోగా రూపుదిద్దుకుంది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది. అంతకంటే ముందే రికార్డులను నెలకొల్పింది. ఈ టీజర్ కేవలం 24 గంటల్లో 1.20 కోట్ల డిజిటల్‌ వ్యూస్‌ను సాధించింది. యూట్యూబ్ లో 7.8 మిలియన్ వ్యూస్ అందుకోగా.. ఫేక్ బుక్ లో మిగిలిన వ్యూస్ అందుకుంది. ఈ వ్యూస్ నిముషాని నిముషాని పెరుగుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం పోస్టర్ ద్వారా వెల్లడించింది. దీంతో చిరు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టీజర్ దశలోనే రికార్డులు సాధిస్తే.. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని రికార్డులను కొల్లగొడుతుందోనని అందరూ ఆశ్చర్యపోతున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతు పతి, తమన్నా తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు భామలు చిరు పక్కన రొమాన్స్ చేయనున్నారు. సైరాకి మొదటి భార్యగా నయనతార నటిస్తోంది. రెండో భార్య గా హ్యూమా ఖురేషి, మూడో భార్యగా ప్రగ్యా జైస్వాల్‌ కనిపించనున్నారు. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus