‘సౌంధర్య’ పాత్రలో తాప్సీ పన్ను!!!

  • November 5, 2016 / 11:25 AM IST

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తాప్సీ….తాజాగా తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో హింది బాట పట్టింది…అయితే అక్కడ సైతం కొన్ని అవకాశాలు లభించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇదిలా ఉంటే తాజాగా పింక్ సినిమాలో మంచి పాత్ర చేసి అందరి మన్నలను పొందిన తాప్సీ మళ్లీ కమర్షియల్ సినిమాలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని పక్కా ప్లాన్ తో దూసుకుపోతుంది…విషయం ఏమిటంటే…20 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో సెన్సేషన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మూవీ అక్కినేని నాగార్జున ‘హలో బ్రదర్’. అక్కినేని నాగార్జున డ్యుయల్ రోల్ లో నటించగా.. రమ్యకృష్ణ-సౌందర్యలు హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే….అయితే ఈ సినిమాని ఎలా అయినా మరో సారి తెరకెక్కించాలని చాలా ప్రయత్నాలే జరిగాయి…కానీ అది పెద్దగా సక్సెస్ కాలేదు.

ఇదిలా ఉంటే…అప్పటి హలో బ్రదర్ ను హిందీలో జుడ్వా పేరుతో రీమేక్ చేశారు. అక్కడ భారీ హిట్ అయిన జుడ్వాకు డేవిడ్ ధావన్ దర్శకుడు. ఇప్పుడు తన కొడుకు వరుణ్ ధావన్ తో మరోసారి ఈ హలోబ్రదర్ రీమేక్ కు లేటెస్ట్ వెర్షన్ రెడీ చేస్తున్నాడు డేవిడ్ ధావన్. ఇక ఈ సినిమాలో రెండు హీరోయిన్ పాత్రల్లో అప్పటి రమ్య కృష్ణ పాత్రలో జాక్వెలిన్ ని ఓ హీరోయిన్ గా ఎంపిక కావడంతో మరో హీరోయిన్ పాత్ర అదే సౌందర్య పాత్రలో….మన అందాల భామ తాప్సి పొన్నును తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికీ పింక్   తో మంచి హిట్ కొట్టి ఊపు మీద ఉన్న ఈ బ్యూటీకి హలో బ్రదర్ సీక్వెల్ మంచి కమర్షియల్ హిట్ కావాలని కోరుకుందాం….

https://www.youtube.com/watch?v=toyfYMBgmBg

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus