రంగు మార్చిన తాప్సీ!

  • May 30, 2016 / 12:09 PM IST

టైటిల్ చూసి నెగిటివ్ గా తీసేసుకోకండి. ఇక్కడ తాప్సీ రంగు మార్చింది తన జుట్టుకు కానీ మనసుకు కాదు. అసలు విషయం ఏంటంటే.. ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “తడ్కా” అనే సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న తాప్సీ ఈ సినిమాలో “టామ్ బోయ్”గా కనిపించనుందట. ఈ సినిమాలో తాప్సీ మోటార్ సైకిల్ నడుపుతూ.. మొగరాయుడిలా కనిపించనుందట.

అందుకోసమే.. తన జుట్టు రంగు కూడా మార్చుకొంది. పింక్ మరియు పర్పుల్ కలర్ కలగలిపి.. తన జుట్టును సరికొత్తగా తీర్చిదిద్దిన తాప్సీ సదరు ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ట్విట్టర్ లో తాప్సీ న్యూ హెయిర్ స్టైల్ ట్రెండింగ్ లో ఉందండోయ్.

ఇకపోతే.. ప్రకాష్ రాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగులో ఆయన తెరకెక్కీంచిన “ఉలవచారు బిర్యానీ”కి రీమేక్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus