టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అందాల ఆరబోతకు సై అంటే అవకాశాలు అవే వస్తాయి అనేది అందరికీ తెలిసిన సత్యం అయితే…హీరోయిన్స్ మాత్రం అవకాశాలు తగ్గినప్పుడల్లా ఇండస్ట్రీపై పడి గోల గోల చేస్తూ ఉంటారు…విషయం ఏమిటంటే…తెలుగు ఇండస్ట్రీలో ‘ఝుమ్మందినాధం’ చిత్రంతో హాట్ హాట్ గా దర్శనమిచ్చిన తాప్సీ తర్వాత వచ్చిన సినిమాల్లో పెద్దగా సక్సెస్ సాధించలేక పోయింది అన్న విషయం మనకు తెలిసిందే….ఇక ఒకానొక సమయంలో దాదాపుగా తెరమరుగు అయిపోయింది అనుకున్నప్పుడే….సైడ్ హీరోయిన్ గా కూడా కొన్ని పాత్రలు చేస్తూ కనిపించింది…
ఇక ఆ మహ్‌డ్య మన యంగ్ హీరో గోపీ చంద్ తో తీసిన ‘సాహసం’లో ఆమె నటించిన తీరు ఆమెకు….మంచి పేరు తెచ్చింది. గత సంవత్సరం లారెస్స్ సరసన వచ్చిన కాంచన 2 తెలుగులో గంగ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఇన్ని హిట్ ఉన్నా…తాప్సికి మాత్రం పెద్ద చాన్సులు మాత్రం రావడంలేదు…ఇక ఇక్కడ చేసేది ఏమీ లేక తన భవిష్యత్తును బాలీవుడ్ లో వెతుక్కుంటూ అక్కడ వాలిపోయింది…..ఇదిలా ఉంటే తాజాగా…ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…..తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను తాను నటించిని మొదటి మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావటంతో తనకు ఐరన్ లెగ్ అనే ముద్రపడిందని ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను ఐరన్ లెగ్ అనడం వల్లే తనకు సినిమాలో ఆఫర్లు రావటం లేదని ఆరోపించింది.
సినిమాలు ఆడకపోతే తప్పునాది ఎలా అవుతుందో ఐరన్ లెగ్ అనేవాళ్లు స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. తెలుగు హీరోయిన్స్ కి గ్లామర్ పాత్రలు తప్ప పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఉన్న సినిమాలో నటించే అవకాశం రాదని స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే వరుస ఫ్లాప్ వచ్చిన సమయంలో కూడా తాప్సీ ఇలా ఎప్పుడూ ప్రవర్తించలేదు…కానీ….బాలీవుడ్ లో బేబీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో అవకాశం వచ్చిందో లేదో వెంటనే తెలుగు ఇండస్ట్రీపై ఇలా కామెంట్స్ మొదలు పెట్టింది…ఇలా మాట్లాడటం మన హీరోయిన్స్ కి కొత్త ఏమీ కాదులే…ఏది ఏమైనా…అక్కడ ఒక హిట్ సినిమా పడగానే ఈ అమ్మడు పూర్తిగా మారిపోయింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.