ఆసక్తికరంగా మారిన తాప్సి ప్రేమ కథ

  • August 10, 2018 / 11:32 AM IST

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగువారికి పరిచయమైన తాప్సి… ప్రభాస్, రవితేజ వంటి హీరోలతో కలిసి నటించింది. తెలుగులో బ్రేక్ రాకపోయేసరికి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి పేరుతెచ్చుకుంది. అమితాబ్ బచ్చన్ తో కలిసి చేసిన పింక్ సినిమా తాప్సి కెరీర్ ని పరుగులు పెట్టించింది. ఆ తర్వాత తెలుగులోనూ ఆనందో బ్రహ్మ వంటి విజయాన్ని అందుకుంది. ఈ బ్యూటీ ఇటీవల బాడ్మింటన్‌ స్టార్‌ మాథ్యూస్‌తో ప్రేమలో పడిందన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రీసెంట్ గా తాప్సీ తన లవర్‌ మాథ్యూస్‌తో కలిసి గోవాకి వెళ్లినట్లు, అక్కడే ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని జోరుగా ప్రచారం సాగింది. ఈ వార్తలను తాప్సి ఖండించింది.

“నా పెళ్ళికి నన్ను పిలవండి” అంటూ సెటైర్ కూడా వేసింది. కానీ ఆమె తన ప్రేమని దాచినప్పటికీ దాగలేదు. ముంబైలో మాథ్యూస్‌తో కలిసి తాప్సి డిన్నర్ డేట్ కి వెళ్ళింది. అక్కడే కెమెరాకి చిక్కింది. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్ లో వైరల్ అయ్యాయి. మాథ్యూస్‌ తెల్ల టీషర్టులో కనిపిస్తే, తాప్సీ గోధుమ రంగు డార్క్ మిడ్డీలో ముసిముసి నవ్వులతో కనిపించింది. దీంతో ముంబై పత్రికలూ శ్రియ, ప్రియాంకా చోప్రా, శృతిహాసన్ రూట్లోనే తాప్సి వెళ్తోందని. విదేశీయుడితోనే కలిసి ప్రయాణించడానికి సిద్ధమైందని కథనాలను ప్రచురించాయి. ఇప్పుడు తాప్సి ఎలా మాట దాటవేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus