స్పీడ్ తగ్గించడం గురించి వివరణ ఇచ్చిన మిల్క్ వైట్ బ్యూటీ

  • June 11, 2018 / 06:26 AM IST

నిన్నమొన్నటివరకూ గ్యాప్ లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్స్ కి మాత్రమే కాక యంగ్ హీరోయిన్స్ కి కూడా పోటీగా నిలిచిన తమన్నా “అభినేత్రి” అనంతరం కాస్త గ్యాప్ తీసుకోవడంతోపాటు.. ఇదివరకట్లా సూపర్ స్పీడ్ గా కాక నిదానంగా ముందుకు సాగుతుంది. రెమ్యూనరేషన్ కోసం కాక కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. ఈ మిల్క్ వైట్ బ్యూటీలో ఉన్నట్లుండి ఈ మార్పేమిటా అని ఆరా తీయగా.. “చాన్నాళ్ల నుంచి వరుసగా సినిమాలు చేసీ చేసీ అలసిపోయాను, కాస్త రెస్ట్ కావాలనిపిస్తుంది, అందుకే కొన్నాళ్లపాటు సినిమాలు తగ్గించి జీవితాన్ని ఆస్వాదించాలనుకొంటున్నాను.

నాకోసం టైమ్ స్పెండ్ చేయడం అలవాటు చేసుకొంటున్నాను. ఫ్రెండ్స్ తో ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాను. ఒక రెండేళ్లపాటు ఇలాగే కంటిన్యూ అయ్యి.. ఇలా బోర్ కొడుతుంది అనిపించినప్పుడు ఈ మళ్ళీ సినిమాల మీద పూర్తి ధ్యాస మళ్లిస్తాను. ఇకపోతే.. తమన్నా నటించిన తాజా చిత్రం “నా నువ్వే” పలుమార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత జూన్ 14న విడుదలవుతోంది. అలాగే.. మెగాస్టార్ చిరంజీవి సరసన “సైరా నరసింహా రెడ్డి” చిత్రంలోనూ నటించనుంది తమన్నా. ఈ రెండు కాకుండా మరో రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus