“బహుబలి”గుట్టు విప్పిన మిల్కి బ్యూటీ!!!

టాలీవుడ్ మిల్కి బ్యూటీ తమన్నా….తన అందాల ఆరబోతతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపడమే కాకుండా….కుర్రకారుకి ఉర్రూతలూగిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సెక్సీ బ్యూటీ బాహుబలిలో ‘అవంతిక’గా మెరిసిన సంగతి తెలిసిందే. అయితే అదే క్రమంలో ఈ భామ ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలతో బిజీగా గడుపుతూ ఉంది. అయితే అందులో….తెలుగులో అభినేత్రి మూవీ అటు తమిళ్ లో డెలి(ల్)గాను.. హిందీలో టూటుక్ టూటుక్ టూటియాగాను విడుదల అవుతోంది. అన్ని వెర్షన్స్ ఒకేరోజున చేయడంతో.. మూడు ఇండస్ట్రీల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

ఇక ఈ ప్రమోషన్ లో భాగంగా తమన్నాను ఇరుకున పెట్టేందుకు, కట్టప్ప గుట్టు విప్పేందుకు మీడియా ప్రతినిధులు తమన్నాని ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసా’ అన్న ప్రశ్న వేశారు…ముందుగానే విషయాన్ని పసిగట్టిన తమన్నా  చాలా తెలివిగా మ్యాటర్ డైవర్ట్ చెయ్యాలని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం మానేసి.. సినిమా గురించి కాసిన్న కబుర్లు చెప్పింది. అయితే విలేఖరులు పదే పదే అదే ప్రశ్న వేస్తూ ఉండడంతో….తమ్ము బేబీకి కోపం పీక్స్ కి వెళ్లిపోయింది…ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ…కట్టప్ప ఎందుకు చంపాడో అనే కాదు.. ఎప్పుడు చంపాడో కూడా తెలీదు. ఎందుకంటే ఆ సీన్ తీసిప్పుడు  నేనక్కడ లేను. నాకు తెలిసినంత వరూ.. ఫస్ట్ భాగం షుటింగ్ చేసేపాటికే.. బాహుబలిని కట్టప్ప చంపేసి ఉంటాడు’ అంటూ చెప్పి…మీడియా ప్రతినిధులకు షాక్ ఇచ్చింది. మిల్కి బ్యూటీనా మజాకా!!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus