తమిళ రీమేక్ లో తమ్మూ బేబీ

  • November 8, 2017 / 07:46 AM IST

రీసెంట్ గా ‘స్వింగ్ జరా’ అంటూ ‘జై లవకుశ’లో హాట్ పెర్ఫార్మెన్స్ తో హీటెక్కించిన తమన్నా ప్రస్తుతం విక్రమ్ సరసన ‘స్కెచ్’ అనే సినిమాలో నటిస్తూ కొన్ని బాలీవుడ్ యాడ్స్ చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తోంది. ‘బాహుబలి’ సూపర్ హిట్ అయిన తర్వాత ఆఫర్లు వెల్లువెత్తగా.. “బాహుబలి 2″లో తమన్నా మహా అయితే ఒక నిమిషం కనిపిస్తుంది. దాంతో ఆమె అభిమానులు కాస్త నిరాశ చెందడంతోపాటు.. తమన్నాను తమ సినిమాలో సెలక్ట్ చేసుకొని “బాహుబలి” క్రేజ్ ను క్యాష్ చేసుకొందామనుకొన్న దర్శకనిర్మాతలు వెనకడుగువేశారు. దాంతో అమ్మడి చేతిలో తెలుగు-తమిళ భాషల్లో సరైన సినిమా లేకుండాపోయింది.

అయితే.. అమ్మడికి బాలీవుడ్ లో మాంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాట సూపర్ హిట్ కొట్టడమే కాక నేషనల్ అవార్డ్ సైతం గెలుచుకొన్న “జిగార్తాండ” (తెలుగులో “చిక్కడు దొరకడు”)ను హిందీలో రీమేక్ చేయనున్నారు. ఫర్హాన్ అక్తర్, సంజయ్ దత్ లు ప్రధాన పాత్రలు పోషించనున్న ఈ చిత్రంలో కథానాయికగా తమన్నా కనువిందు చేయనుందట. ఇకపోతే.. తమన్నా ప్రస్తుతం తెలుగులో “క్వీన్” రీమేక్ లో నటిస్తోంది. వీటితోపాటు మరికొన్ని హిందీ ప్రొజెక్ట్స్ కూడా సైన్ చేసిందట తమ్మూ బ్యూటీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus