తన వివాహంపై క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ

దక్షిణాది సినీ పరిశ్రమలోనే కాకుండా హిందీలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటి తమన్నా. అందం, అభినయంతో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘అభినేత్రి’ చిత్రంలో టైటిల్ రోల్ పోషించింది. ఈ చిత్రం హిందీ, తమిళంలో డెవిల్ గా రిలీజ్ కానుంది.  ప్రభుదేవా,  తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్‌ 7న విడుదలవుతుంది.

ఈ మూవీ తరవాత తమన్నా పెళ్లి చేసుకోనున్నట్లు కొంత కాలంగా వార్త చక్కర్లు కొట్టింది. ‘అభినేత్రి’ ప్రచారంలో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె తన పెళ్లి వార్తలను ఖండించింది. “నేను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాను. ఈ సమయంలో పెళ్లి చేసుకోను. మరో రెండేళ్ల పాటు ఆ ఆలోచన నాకు లేదు” అని పాల బుగ్గల సుందరి స్పష్టం చేసింది.

https://www.youtube.com/watch?v=wdh-OT15BAw

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus