Tamannaah: పెళ్లి పిల్లల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి తమన్నా ?

  • October 17, 2022 / 12:34 PM IST

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలో వయసు పైబడిన పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడరు. పెళ్లి చేసుకుంటే తమ కెరియర్ ఎక్కడ దెబ్బతింటుందోనని వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు. ఇక ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది హీరోయిన్లు నాలుగు పదుల వయసులోకి వచ్చిన ఒంటరిగానే ఉన్నారు. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి తమన్నా కూడా ఇంకా ఒంటరిగానే ఉన్నారు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపుగా దశబ్దన్నర కాలం అవుతుంది.

అయినప్పటికీ ఈమె తెలుగు తమిళ భాషలలో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కానీ ఇంతవరకు పెళ్లి గురించి ఏ విధమైనటువంటి ఆలోచన చేయలేదు.తాజాగా బబ్లీ బౌన్సర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ప్రస్తుతం తెలుగులోనూ తమిళంలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. పెళ్లి పిల్లల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తమన్న మాట్లాడుతూ తాను ఇన్నిరోజుల పాటు వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల పెళ్లి గురించి ఆలోచన చేయలేదు.

 

అంతేకానీ తాను పెళ్లికి వ్యతిరేకిని కాదు త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కంటాను అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే తమన్నా ఇప్పటికి తనకు కాబోయే వ్యక్తిని సెట్ చేసుకున్నారని తెలుస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక తెలుగులో గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించారు. అలాగే చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక తమిళంలో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus