‘హారర్ కామెడీ జోనర్’లో తమన్నా!!!

మిల్కీ బ్యూటీ, అందాల భామ తమన్నా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తమన్నా ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్ళలో ఆమెకు పెద్ద హీరోలతో అవకాశాలు అయితే వరుసగా వచ్చాయి కానీ, హిట్స్ అయితే రాలేదు. ఐతే ఒకానొక సమయంలో తమన్న పని అయిపోయింది అని సైతం అనుకున్నారు అందరు. ఇదే క్రమంలో అనుకోకుండా, బాహుబలి నుంచి ఊపిరి వరకు వరుసగా హిట్స్ కొట్టడంతో మంచి జోష్ తో దూసుకుపొతూ ముందుకు దూసుకెళ్తింది. ఇదిలా ఉంటే, తాజాగా తమన్నా బాహుబలి2 తో పాటు.. అభినేత్రి చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే  ఈ అభినేత్రి సినిమాకు గాను తమన్నాలో కొన్ని మార్పులు అవసరం అని దర్శకుడు చెప్పగా, వాటిపై కసరత్తులు మొదలు పెట్టింది తమ్మూ…తమ్మూ చేస్తున్న బాహుబలి2 తో పాటు.. అభినేత్రి చిత్రంలో లీడ్ రోల్ లో ఆమె నటిస్తూ దూసుకుపోతుంది. ఇక ఇదే క్రమంలో తమ్ములో కొన్ని చేంజస్ ఉండాలని దర్శకుడు చెప్పగానే వాటిపై దృష్టి పెట్టింది ఈ మిల్కీ బ్యూటీ…ఇంతకీ ఏంటో ఆ మార్పులు అంటే….ఈ సినిమా ఆమె చేస్తున్న తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ. ఇక సినిమాలో ప్రభుదేవా – సోనూ సూద్ – అమీ జాక్సన్ లు కూడా ఉన్నా… తమన్నా కేరక్టర్ ప్రధానం కావడం, పైగా మూడు భాషల్లో తెరకెక్కుతూ ఉండడంతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది మన సెక్సీ బ్యూటీ.

ఈ సినిమా కధ ప్రకారం ఆ పాత్ర కోసం కొంత బరువు పెరగాలని నిర్ణయించుకుందిట తమ్మూ. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. పాత్రలో వేరియేషన్ చూపించాల్సిన అవసరం ఉండడంతో.. ఇలా తన పర్సనాలిటీని కూడా మార్చుకునేందుకు తమన్నా సిద్ధమయింది అని తెలుస్తుంది. అదే క్రమంలో ఈ ప్రభావం వేరే సినిమాలపై పడకుండా జాగ్రత్తలు సైతం తీసుకుంటుంది అని టాక్. ఏది ఏమైనా….బేబీ డెడికేషన్ ను మెచ్చుకుని తీరాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus