మిల్కీ బ్యూటీ.. బోల్డ్ సీన్ కి నో చెప్పడానికి కారణం అదే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్స్ సైతం బోల్డ్ సీన్స్ లో నటించడానికి సై అంటున్నారు. బాలీవుడ్ ను ఏ మాత్రం తీసిపోకుండా కొంతమంది బోల్డ్ సీన్లలో నటిస్తున్నారు.అయితే తమన్నా మాత్రం వీటికి నో అంటుంది. బాలీవుడ్ లో కంగనా నటించిన సూపర్ హిట్ ‘క్వీన్’ రీమేక్ తెలుగులో తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే . ‘అ!’ వంటి డిఫరెంట్ చిత్రంతో హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. ‘దట్ ఈజ్ మహాలక్ష్మీ’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ సీన్ కు తమన్నా నో చెప్పిందట.

కోలీవుడ్ లో ఈ చిత్రాన్ని ‘పారిస్ పారిస్’ పేరుతో రీమేక్ చేస్తుండగా.. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటీవల విడుదల చేసిన ‘పారిస్ పారిస్’ టీజర్లో కాజల్ బ్రెస్ట్ ప్రెస్ చేసే సీన్ ఉంది. ఆ సీన్ హిందీలో ఉన్నట్లుగానే పెట్టారంట. అయితే తమిళ్ ట్రైలర్ లో ఆ సీన్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అయితే తెలుగు టీజర్లో ఆ సీన్ లేదు.. దీనికి తమన్నా అంగీకరించలేదంట.మరీ వల్గర్ గా ఉంటుందని తమన్నా చిత్ర యూనిట్ కి వివరణ ఇచిందట. తెలుగులో తమన్నా ‘దట్ ఈజ్ మహాలక్ష్మీ’ ట్రైలర్ కు రెస్పాన్స్ సరిగ్గా రెస్పాన్స్ రావట్లేదు. కాజల్ ట్రైలర్ మాత్రం దూసుకుపోతుంది. మరి ప్రమోషన్స్ విషయంలో ఇంకేదైనా కొత్తగా ట్రై చేస్తారేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus