కాజల్ కన్నా శృతి హాసన్ ఎక్కువ : తమన్నా

  • February 22, 2019 / 06:53 PM IST

శృతి హాసన్…తమన్నా.. కాజల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అగ్ర హీరోయిన్లుగా చలామణీ అవుతున్న ఈ భామలు ఇప్పటికే తెలుగు తమిళ భాషల్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించేసారు. ముఖ్యంగా తెలుగులో అందరి స్టార్ హీరోలతోని ఆడి పాడిన ఈ భామలకు ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేనప్పటికీ.. వీరి క్రేజ్ ఏమాత్రం తగ్గక పోవడం విశేషం. దీంతో బాలీవుడ్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నా… అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం యువ హీరోలు… సీనియర్ హీరోల సరసన నటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక బయట కూడా ఈ ముగ్గురు హీరోయిన్లూ… మంచి స్నేహితులని అందరికీ తెలిసిందే.

అంతే కాదు ఏదైనా సినీ వేడుకలో కలిశారంటే తెగ సందడి చేస్తారు. ఇక ఇటీవల తమన్నా పాల్గొన్న ఇంటర్వ్యూలో వీరి స్నేహం గురించి వివరిస్తూ …. “మేము ముగ్గురం కలుసుకున్నామంటే.. మాకు అస్సలు సమయం తెలియదు. ఏదైనా ఓ చిలిపి పని చేయాలనుకుంటే, నా పక్కన కాజల్ కంటే శృతి హాసన్ ఉంటేనే బాగుండు అనిపిస్తుంది. అలా అనిపించిన వెంటనే శృతి కి ఫోన్ చేసి పిలిపిస్తాను. శృతి హాసన్ తో కలిసి నటించాలని ఎప్పటి నుండో ఆశగా వుంది. ఒకవేళ మరో హీరోయిన్ తో కలిసి నటించవలసి వస్తే, అవతలి హీరోయిన్ శృతి కావాలని కోరుకుంటున్నాను… ఇద్దరు కథానాయికలకు సంబంధించిన కథలను ఎవరు వినిపిస్తారా అని ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం పై శృతి హాసన్ స్పందిస్తూ .. “థ్యాంక్స్ తమన్నా …. త్వరలోనే మనమిద్దరం కలిసి ఓ సినిమా చేద్దాం” అంటూ శృతి హాసన్ తన ట్విట్టర్ ద్వారా.. తమన్నాని ట్యాగ్ చేస్తూ పేర్కొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus