కళ్యాణ్ రామ్ కోసం ఆర్జేగా మారిన తమన్నా

  • August 29, 2017 / 11:55 AM IST

ఇప్పటికి 50కి పైగా చిత్రాల్లో నటించిన తమన్నా చాలా డిఫరెంట్ రోల్స్ ప్లే చేసింది. అయితే ప్రేక్షకులు అమ్మడు చేసిన రోల్స్ కంటే ఆ రోల్స్ లో అమ్మడు ఎంత అందంగా కనిపించింది అనే అంశాన్ని మాత్రమే గమనించారనుకోండి అది వేరే విషయం. “ఊసరవెల్లి” అనంతరం తమన్నా మరోమారు ఒక పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ లో కనువిందు చేయనుంది.

కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా “180” ఫేమ్ జయేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యూత్ ఫుల్ లవ్ స్టోరీలో తమన్నాను కథానాయికగా ఎంపిక చేశారు. ముందుగా ఐశ్వర్య లక్ష్మీ అనే మలయాళ కుట్టిని కథానాయికగా ఎంపిక చేసినప్పటికీ.. అమ్మడి పెర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, సినిమాకి ఎవరైనా స్టార్ హీరోయిన్ అయితే వేల్యూ పెరుగుతుందని దర్శకనిర్మాతలు భావించడంతో తమన్నా లిస్ట్ లోకి వచ్చింది. ఈ చిత్రంలో తమన్నా రేడియో జాకీగా నటించనుందట. త్వరలోనే షూటింగ్ లో పాలుపంచుకోనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus