Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ఓ చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఓవైపు ‘పెద్ది’ సినిమా పాటల రచయిత అనంత శ్రీరామ్‌ ఉంటే.. మరోవైపు తెలుగు సినిమాను ఉద్దరిస్తాం అంటూ ట్యాగ్‌ వేసుకున్న ట్రోలర్లు. ‘పెద్ది’ సినిమాలోని ఐటెమ్‌ సాంగ్‌ విషయంలో మనోభావాలు దెబ్బతిన్నాయని, అలా ఎలా రాస్తారు, ఇదే సాహిత్యం, తెలుగును.. తెలుగు సినమాను భ్రష్ఠు పట్టిస్తున్నారు అంటూ గోల గోల చేస్తున్నారు. దానికి రియాక్షన్‌గా అనంత్‌ శ్రీరామ్‌ ఐటమ్‌ గాళ్లు, దురదగాళ్లు అంటూ నోరు చేసుకుంటున్నారు.

Tamannaah

వీటికి సంబంధం లేదు కానీ.. ఐటెమ్‌ సాంగ్స్‌ విషయంలో చాలా రోజులుగా జరుగుతున్న మరో రకమైన చర్చకు ప్రముఖ కథానాయిక, ఐటెమ్‌ సాంగ్స్‌ స్పెషలిస్ట్‌ తమన్నా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక విధంగా ఆ చర్చకు ఎండింగ్‌ ఇచ్చే ప్రయత్నం అని చెప్పాలి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆస్వాదించే ప్రత్యేక గీతాలను ఎంచుకున్నప్పుడు వాటిని ఐటమ్‌ పాటలుగా చూడను.. నా వరకు అవి ప్రత్యేక డ్యాన్స్‌ నంబర్లే అని క్లారిటీ ఇచ్చింది తమన్నా. అంటే ఐటెమ్‌ సాంగ్‌ అని పిలవొద్దు అని చెప్పకనే చెప్పింది.

ప్రస్తుతం హిందీ పరిశ్రమలో వరుస సినిమాలతో బిజీగా ఉంది తమన్నా. అలాగే ఎప్పుడు ఐటమ్‌ సాంగ్‌ అవకాశం వచ్చినా నో చెప్పకుండా చేస్తూనే ఉంది. దీని గురించి తమన్నా మాట్లాడుతూ పాటల్లో డ్యాన్స్‌ కరీనా కపూర్‌, కత్రినా కైఫ్‌ చేయడం ప్రేక్షకులకు గుర్తుండకపోవచ్చు. కానీ వాళ్లు చేసిన ‘చమ్మక్‌ చల్లో…’, ‘షీలా కీ జవానీ…’, ‘చికినీ చమేలీ..’, ‘కమ్లీ…’ లాంటి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఈ ప్రత్యేక గీతాల్లో నటీమణులు ప్రదర్శించిన హుందాతనం, డ్యాన్స్‌ను అందరూ ఆస్వాదించారు.

వారంతా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇలాంటి పాటలకి డ్యాన్స్‌ చేస్తారు. అలా నా వరకు ఆ పాటలు పార్టీ డ్యాన్స్‌ పాటలంతే. వీటిని ఒక ఐటమ్‌ పాట అని చెప్పడానికే ఇష్టపడతాను. ఎందుకంటే ఇవి ఎప్పటికీ పార్టీ పాటలుగానే ఉంటాయి అని చెప్పింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus