తమన్నాపై ఆ ముద్ర తొలగిపోతుందా..?

Advertisement

తమన్నా టాప్ హీరోయిన్ల లిస్టులో అయితే ఉంది కానీ.. తన కెరీర్ లో హిట్ సినిమాలు చాలా త‌క్కువ. త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ పాతిక సినిమాల వ‌ర‌కూ చేసింది. అగ్ర హీరోల‌తో జ‌త క‌ట్టింది. అయితే ఒక‌ట్రెండు త‌ప్ప హిట్స్ అనిపించుకోలేదు. ప‌వ‌న్, మ‌హేష్‌, ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ల‌తో త‌మ్మూ న‌టించిన సినిమాల‌న్నీ ఫ్లాప్ అయ్యాయి. దాంతో..

త‌మ‌న్నాపై ఐరెన్ లెగ్ అనేముద్ర ప‌డిపోయింది. త‌మ‌న్నా పెద్ద హీరోతో జ‌త క‌డితే ఆ సినిమా ఫ్లాప్ అనే అనుకొనేవారు. ఆ జాత‌కాన్ని ఊపిరి మార్చేసింద‌నే చెప్పాలి. త‌మ‌న్నా బ్యాడ్ సెంటిమెంట్ ఈ సినిమాతోనూ రిపీట్ అవుతుందేమో ??  అన్న‌ట్టుగా చూశారు. కానీ ఊపిరికి సూప‌ర్ హిట్ టాక్ వచ్చేసింది. దాంతో టీమ్ అంద‌రి కంటే త‌మ‌న్నానే ఎక్కువ సంబ‌రప‌డుతోంది. ఈ హిట్ తో ఐరన్ లెగ్ ముద్ర తొలగిపోతుందని తమన్నా భావిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus